ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- లష్కరే టాప్​ కమాండర్​​ హతం

author img

By

Published : Jan 3, 2022, 6:58 PM IST

Let ultra Salim Parray killed:
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​: ఎల్​ఈటీ వాంటెడ్​ టెర్రరిస్ట్​ హతం

Let terrorist Salim Parray killed: జమ్ముకశ్మీర్​ హర్వాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఎల్​ఈటీ టాప్​ కమాండర్​​ సలీమ్​ను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. మరో ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడిని భద్రతాదళాలు హతమర్చాయి.

Let terrorist Salim Parray killed: జమ్ముకశ్మీర్​లో సోమవారం జరిగిన రెండు వేరువేరు ఎన్​కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

హర్వాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో.. లష్కరే తొయిబా(ఎల్​ఈటీ) టాప్​ కమాండర్​​ సలీమ్​ పర్రేను హతమార్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఎన్​కౌంటర్​కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ వెల్లడించారు.

మరో ఎన్​కౌంటర్​..

Jammu Kashmir encounter news today: హర్వాన్​కు సమీపంలోని గాసు గ్రామంలో మరో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాది ఎవరు? అతను ఏ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి? అన్న అంశాలపై దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

భారీగా ఆయుధాలు స్వాధీనం..

పాక్​ నుంచి దేశంలోకి ఆయుధాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాను బీఎస్​ఎఫ్​ జవాన్లు అడ్డుకున్నారు.

ఆర్నియా సెక్టర్​లో.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అప్రమత్తంగా ఉన్న జవాన్లు.. సోమవారం ఉదయం వేళ అనుమానాస్పద రీతిలో ఉన్న బ్యాగును గుర్తించారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకున్నారు. అందులో 3 ఏకే 47 తుపాకులు, 4 పిస్టళ్లు, వివిధ రకాల బులెట్లతో పాటు 5 ప్యాకెట్ల హెరాయిన్​ ఉన్నాయి.

Jammu Kashmir encounter news today
బీఎస్​ఎఫ్​ జవాన్లు స్వాధీనం చేసుకున్న బ్యాగు
Jammu Kashmir encounter news today
బీఎస్​ఎఫ్​ జవాన్లు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
Jammu Kashmir encounter news today
బీఎస్​ఎఫ్​ జవాన్లు స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు

ఇదీ చూడండి:- జమ్ముకశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.