ETV Bharat / bharat

కరోనా పంజా- దిల్లీలో 5లక్షలు దాటిన కేసులు

author img

By

Published : Nov 18, 2020, 10:58 PM IST

Updated : Nov 18, 2020, 11:46 PM IST

Covid_India
కేరళలో కొత్తగా 6 వేల మందికి వైరస్

దేశవ్యాప్తంగా కొవిడ్​ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో... మొత్తంగా 38,617 కొత్త కేసులు నమోదయ్యాయి. 44,739 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కానీ వరుసగా 11వ రోజు 50వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ సహా.. దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. దిల్లీలో ఒక్కరోజులోనే 7,486 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 5లక్షల 3వేల 84కు ఎగబాకింది. మరో 131 మరణాలతో.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8వేలకు సమీపించింది.

  • కేరళలో కొత్తగా 6,419 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 69,394. ఇప్పటివరకూ 4 లక్షలకు పైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 5,011 కొవిడ్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. 100 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలు దాటగా మొత్తం మృతుల సంఖ్య 46,202కి పెరిగింది. ప్రస్తుతం 80,221 యాక్టివ్​ కేసులున్నాయి. కేవలం ముంబయిలోనే 871 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • బంగాల్​లో తాజాగా 3,668 మందికి పాజిటివ్​ అని తేలింది. 54 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,41,885కి ఎగబాకింది. మృతుల సంఖ్య 7,820కి చేరింది. ప్రస్తుతం 26,296 యాక్టివ్​ కేసులున్నాయి.
  • హరియాణాలో గడిచిన 24 గంటల్లో 2,562 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2,07,039కి పెరిగింది. రాష్ట్రంలో 19,543 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • కర్ణాటకలో తాజాగా 1,791 మందికి వైరస్​ సోకింది. 21 మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 11,578కి పెరిగింది. ప్రస్తుతం ఉన్న యాక్టివ్​ కేసుల సంఖ్య 25,146 కాగా రాష్ట్రంలో మొత్తంగా 8,65,931 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:'చైనా మైక్రోవేవ్ దాడి'.. అవాస్తవం: భారత ఆర్మీ

Last Updated :Nov 18, 2020, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.