ETV Bharat / bharat

Afghan news: తాలిబన్​ చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి..

అఫ్గానిస్థాన్​ సంక్షోభం(Taliban Crisis in Afghanistan) నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న 168 మందితో బయలు దేరిన సీ-17 యుద్ధ విమానం భారత్​కు చేరుకుంది. గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం దిగింది.

indians reached india from afghanistan
అఫ్గాన్ నుంచి మాతృభూమికి చేరిన భారతీయులు
author img

By

Published : Aug 22, 2021, 11:07 AM IST

Updated : Aug 22, 2021, 12:44 PM IST

తాలిబన్ల హస్తగతమైన తర్వాత అఫ్గాన్​లో(Taliban Crisis in Afghanistan) చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాబుల్(Kabul)​ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 యుద్ధ విమానం.. భారత్​కు చేరుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్​ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్​కు చేరుకున్నారు.

indians reached from afghan
హిండన్ వైమానిక స్థావరంలో.. స్వదేశానికి చేరిన భారతీయులు
indians reached from afghan
వీల్​-ఛైర్​లో మహిళను తీసుకువస్తున్న దృశ్యం

కరోనా విజృంభణ నేపథ్యంలో కాబుల్​ నుంచి హిండన్ చేరుకున్న వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

indians reached from afghan
హిండన్ వైమానిక స్థావరంలో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు
indians reached from afghan
హిండన్​ వైమానిక స్థావరంలో ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు

అంతా నాశనం..

భారత్​కు చేరిన విమానంలో అఫ్గాన్​కు చెందిన ఎంపీ నరేందర్​ సింగ్​ ఖాస్లా కూడా ఉన్నారు. '20 ఏళ్లుగా నిర్మించుకున్నదంతా.. నాశనమైపోయింది' అంటూ గద్గద స్వరంతో ఆయన చెప్పారు.

అంతకుముందు, కాబుల్​ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి సారించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అప్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల సంఖ్య.. 400 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

పోలియో రహితంగా ఉండేందుకు..

మరోవైపు.. అఫ్గాన్ నుంచి వచ్చిన వారందరికీ పోలియో టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవియా తెలిపారు. దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీకా తీసుకుంటున్న వారి ఫొటోను ఆయన ట్విట్టర్​ వేదికగా షేర్ చేశారు.

polio vaccine at delhi
దిల్లీలో అఫ్గాన్​ నుంచి వచ్చినవారికి పోలియో టీకాలు వేస్తున్న దృశ్యం

ఇదీ చూడండి: Afghan: తాలిబన్ల నుంచి తప్పించి.. సూపర్​ వుమన్​గా నిలిచి!

ఇదీ చూడండి: Afghan crisis: ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

Last Updated : Aug 22, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.