ETV Bharat / international

Afghan crisis: ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

author img

By

Published : Aug 21, 2021, 8:25 PM IST

Updated : Aug 21, 2021, 9:28 PM IST

కాబుల్​ విమానాశ్రయం వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గానిస్థాన్​ వదిలెళ్లడానికి ఎయిర్​పోర్టు బయట చిన్నారులతో కలిసి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ఆకలిదప్పికలు మరచి, ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.

Kabul airport
తాలిబన్

దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్​ విమానాశ్రయంలో అఫ్గానీల పడిగాపులు

అఫ్గానిస్థాన్​లో దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబన్ల అరాచకాలకు వణికిపోతున్న ప్రజలు ఎప్పుడెప్పుడు దేశం వదిలి బయటపడతామా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. యుద్ధంలో సహాయపడిన అఫ్గానీలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామనే బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ప్రకటన మేరకు కాబుల్​ విమానాశ్రయానికి పోటెత్తున్నారు. వేలకొద్ది జనంతో ఎయిర్​పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

రద్దీని అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి బ్రిటిష్ భద్రతా దళాలు. అయినప్పటికీ తోపులాటలు, తొక్కిసలాటలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు, మహిళలు నలిగిపోతున్నారు.

Kabul airport
తోపులాటను అదుపుచేస్తున్న భద్రతా దళాలు

ఆదుకుంటానన్న బైడెన్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అఫ్గానీలను సురక్షిత ప్రదేశాలకు చేరవేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఆకలి, ఆర్తనాథాలను పట్టించుకోకుండా గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడుతున్నారు ప్రజలు. బయటపడే అవకాశం దక్కుతుందో లేదో తెలియక బిక్కుబిక్కుమంటూనే జీవిస్తున్నారు.

కాబుల్​లో ఇలా ఓవైపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న వేళ మరో పక్క నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు తాలిబన్లు.

Kabul airport
ఎయిర్​పోర్టు వద్ద జనాల పడిగాపులు

'తాలిబన్లతో కలిసి పనిచేస్తాం..'

తాలిబన్ల పాలనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. అవసరమైతే వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్. అఫ్గాన్​లో నెలకొన్న సమస్య పరిష్కారం కోసం దౌత్యపరమైన యత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అఫ్గాన్​ సంక్షోభంపై అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన జాన్సన్.. అక్కడి నుంచి బ్రిటన్ పౌరులను స్వదేశానికి తరలించడానికి బలమైన సవాళ్లు ఉన్నాయని తెలిపారు.

Kabul airport
ఉద్రిక్తతల మధ్య చిన్నారి

రికార్డు స్థాయిలో..

గతవారం కాబుల్​ నుంచి బయలుదేరినంలో సీ-17 విమానంలో రికార్డు స్థాయిలో 823మంది అఫ్గాన్​ శరణార్థులను తరలించినట్లు అమెరికా వాయుసేన స్పష్టంచేసింది. తొలుత 640మందే అనుకున్నా.. ప్రజల ఒడిలో కూర్చున్న 183 మంది చిన్నారులను కూడా కలిపితే 823 మంది అవుతుందని వివరించింది.

ఫ్రాన్స్​ సహకారం..

407మంది అఫ్గానీలు సహా 570 మందిని తమ మిలిటరీ విమానంలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఫ్రాన్స్ వెల్లడించింది. నలుగురు ఫ్రెంచ్ పౌరులు సహా 99మంది అప్గానీలను శుక్రవారం సాయంత్రం పారిస్ తీసుకొచ్చినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి: Afghan crisis: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

Last Updated : Aug 21, 2021, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.