ETV Bharat / bharat

తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 13వేల మందికి వైరస్

author img

By

Published : Jul 5, 2022, 9:47 AM IST

India covid cases
India covid cases

Covid Cases In India: భారత్​లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారంతో పోలిస్తే కొత్త కేసులు మూడు వేలు తక్కువగా నమోదయ్యాయి. 19మంది చనిపోయారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్​ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్​ నుంచి 12,456 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది.

  • మొత్తం కేసులు: 4,35,31,650‬
  • మొత్తం మరణాలు: 5,25,242
  • యాక్టివ్​ కేసులు: 1,14,475
  • కోలుకున్నవారి సంఖ్య: 4,28,91,933

Vaccination India: భారత్​లో సోమవారం 11,44,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,76,637 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 804 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,51,67,797కు చేరింది. మరణాల సంఖ్య 63,62,347 చేరింది. ఒక్కరోజే 6,59,745 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,98,96,665కు చేరింది.

  • జర్మనీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఒక్కరోజే 147,489 కేసులు నమోదయ్యాయి. 102 మంది కొవిడ్ తీవ్రతకు బలయ్యారు.
  • ఇటలీలో ఒక్కరోజే 36వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 33,833 మంది కొవిడ్​ బారినపడగా.. 84 మంది మరణించారు.
  • తైవాన్​లో 32,681 కేసులు బయటపడగా.. 88 మంది తుది శ్వాస విడిచారు.
  • ఆస్ట్రేలియాలో కొత్తగా 29,661 మందికి వైరస్​ సోకగా.. 26 మంది మరణించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.