ETV Bharat / bharat

స్థిరంగా కరోనా వ్యాప్తి.. కొత్త కేసులు 16వేలకు పైనే

author img

By

Published : Jul 4, 2022, 9:51 AM IST

Updated : Jul 4, 2022, 10:40 AM IST

India covid cases
India covid cases

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 16,135 మందికి వైరస్​ సోకింది. మరో 24 మంది చనిపోయారు. 19,958 మంది కోలుకున్నారు.

Covid Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,135 మంది వైరస్​ బారినపడగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 13,958 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.85శాతానికి ఎగబాకింది.

  • మొత్తం మరణాలు: 5,25,223
  • యాక్టివ్​ కేసులు: 1,13,864
  • కోలుకున్నవారి సంఖ్య: 4,28,79,477

Vaccination India: భారత్​లో ఆదివారం 1,78,383 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,98,21,197కు చేరింది. మరో 3,32,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,36,614 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 566 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,43,43,968కు చేరింది. మరణాల సంఖ్య 63,61,372 చేరింది. ఒక్కరోజే 485,179 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 529,190,953కు చేరింది.

  • ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఒక్కరోజే 71వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తైవాన్​లో 32,681 కేసులు బయటపడగా.. 88 మంది తుది శ్వాస విడిచారు.
  • ఆస్ట్రేలియాలో కొత్తగా 30,282 మందికి వైరస్​ సోకగా.. 30 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో ఒక్కరోజే 25,549 మంది కొవిడ్​ బారినపడగా.. 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మెక్సికోలో 24,610 కేసులు నమోదు కాగా.. 28 మంది మరణించారు.

ఇదీ చదవండి: 'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు

Last Updated :Jul 4, 2022, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.