ETV Bharat / bharat

India Covid cases: భారత్​లో 30 వేల దిగువకు రోజువారీ కేసులు

author img

By

Published : Feb 15, 2022, 9:11 AM IST

India covid cases,
India covid cases,

India Covid cases: భారత్​లో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులు 30 వేల దిగువకు చేరాయి. 347 మంది చనిపోయారు. ఒక్కరోజే 82 వేల మందికిపైగా కోలుకున్నారు.

India Covid cases: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 27,409 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. కొవిడ్​ ధాటికి మరో 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,817 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 4,26,92,943
  • మొత్తం మరణాలు: 5,09,358
  • యాక్టివ్ కేసులు: 4,23,127
  • మొత్తం కోలుకున్నవారు: 4,17,60,458

Covid Tests in India: దేశవ్యాప్తంగా సోమవారం 12,29,536 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,30,33,302కు చేరింది.

Vaccination in India:

దేశంలో సోమవారం 44,68,365 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,73,42,62,440 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World corona cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 14,51,933 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 7 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్​ కేసుల సంఖ్య 41,39,72,858గా ఉండగా.. మరణాల సంఖ్య 58,44,701కు చేరింది.

  • అమెరికాలో 79 వేల కొత్త కేసులు.. 940 మరణాలు నమోదయ్యాయి.
  • బ్రిటన్​లో 41 వేల మంది ఒక్కరోజే వైరస్​ బారినపడ్డారు. మరో 35 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 1.80 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 683మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో ఒక్కరోజే 1.27 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 130 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 26 వేల మందికి కరోనా సోకింది. 385 మంది మరణించారు.
  • టర్కీలో తాజాగా 76 వేల కేసులు బయటపడగా.. 266 మంది బలయ్యారు.
  • జపాన్​లో ఒక్కరోజే 67 వేలకు పైగా మందికి వైరస్ సోకింది. మరో 143 మంది మృతిచెందారు.

ఇవీ చూడండి: 'కాంగ్రెస్​తో కష్టమే.. కేసీఆర్​, స్టాలిన్​తో కలిసి దిల్లీపై గురి!'

కట్టెల కోసం వెళ్లిన బాలికపై 16 మంది అత్యాచారం

ఉక్రెయిన్​లో చిక్కుకున్న 18వేల మంది భారతీయులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.