ETV Bharat / bharat

భారత్​లో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Jun 5, 2022, 9:48 AM IST

Updated : Jun 5, 2022, 10:52 AM IST

india-corona-cases
india-corona-cases

India Covid cases: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 4,270 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 15 మంది చనిపోయారు. శనివారం 2,619 మంది కోలుకున్నారు.

India Corona cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 4,270 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే 15 మంది చనిపోయారు. శనివారం 2,619 మందికిపైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేరళలో శనివారం ఒక్కరోజే 1,544 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

  • దేశంలో మొత్తం కరోనా కేసులు: 4,31,76,817‬
  • మొత్తం మరణాలు: 5,24,692
  • యాక్టివ్​ కేసులు: 24,052
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,28,073

Vaccination India: దేశవ్యాప్తంగా శనివారం 11,92,427 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,09,46,157కు చేరింది. మరో 4,13,699 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 402,317 మంది వైరస్​ బారినపడ్డారు. 756 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 535,040,554కు చేరింది. మరణాల సంఖ్య 6,319,796కు చేరింది. ఒక్కరోజే 365,521 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 505,791,706గా ఉంది.

  • ఉత్తర కొరియాలో మళ్లీ రికార్డు స్థాయిలో 79 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
  • తైవాన్​లో శనివారం 68,151 మంది మహమ్మారి​ బారినపడ్డారు. 152 మంది మరణించారు
  • అమెరికాలో శనివారం 46,180 కొత్త కేసులు, 96 మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీలో మరో 29,014 మంది కొవిడ్​ బారినపడ్డారు. ఒక్కరోజు 47 మంది చనిపోయారు.
  • ఆస్ట్రేలియాలో 27,234 మందికి వైరస్​కు సోకింది.

ఇవీ చదవండి: అహింసతో ఆంగ్లేయులకు చుక్కలు.. ఆ ఊరంతా సత్యాగ్రహులే!

'మహా'లో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కరోనా కేసులు

Last Updated :Jun 5, 2022, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.