ETV Bharat / bharat

మరదలిపై ప్రేమ.. భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త..

author img

By

Published : Jan 13, 2023, 10:32 AM IST

Updated : Jan 13, 2023, 11:59 AM IST

jharkhand husband stabbed his wife news
భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

మరదలిని ప్రేమించిన ఓ వ్యక్తి.. తన భార్యను కత్తితో పొడచి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన ఝార్ఖండ్​లో వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఝార్ఖండ్​లోని ధన్​బాద్ జిల్లా​లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరదలిని ప్రేమించిన ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే?..

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
మహవీర్ నగర్​కు చెందిన అనిల్ డోమ్ అనే వ్యక్తికి అంజలీ దేవి అనే మహిళతో ఇంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ వ్యక్తి తన మరదలు దివ్యను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు అతడి కుటుంబసభ్యులు తిరస్కరించారు. దీంతో అతడి భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుని.. జనవరి 8న ఆమెను ఇంట్లో నుంచి రోడ్డు పైకి ఈడ్చుకొచ్చి కత్తితో దారుణంగా పొడిచాడు. వెంటనే ఆమెను ఎస్ఎన్ఎంఎంసీహెచ్​ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అంజలీ దేవిని కాపాడేందుకు అడ్డుగా వచ్చిన అతడి మరదలు, అత్తకు కూడా గాయాలయ్యాయి.

హాస్పిటల్​లో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. ఘటనానంతరం నిందితుడు అనిల్ పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అతడిని గురువారం అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. తాను వన్​ సైడ్ లవ్​ చేసిన మరదలిని దక్కించుకునేందుకే భార్యను హత్య చేశానని నిందితుడు పోలీసులతో చెప్పాడు. ఘటన జరిగిన రోజు.. అనిల్​ మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.

గుండెపోటుతో మృతి చెందిన ముగ్గురు వృద్ధ యాచకులు..
మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ఉజ్జయినిలోని మహకల్ పోలీసుస్టేషన్ పరిధిలో ముగ్గురు వృద్ధ యాచకులు మృతి చెందారు. మృతదేహాలకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా.. ముగ్గరూ గుండెపోటుతో మరణించినట్లు తేలింది. మృతుల వయసు దాదాపు 70 నుంచి 75 ఏళ్ల మధ్యలో ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఫుట్​పాత్​పై నివసించే ముగ్గురు వృద్ధులు బహుశా చలి కారణంగా మృతిచెంది ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Last Updated :Jan 13, 2023, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.