ETV Bharat / bharat

రాయికి బదులు కిడ్నీ తొలగించిన వైద్యుడికి భారీ ఫైన్​

author img

By

Published : Oct 19, 2021, 9:37 PM IST

kidney removed instead stones doctor
కిడ్నీ తొలగించిన వైద్యుడికి భారీ ఫైన్​

రాయికి బదులు కిడ్నీ తొలగించిన కేసులో.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. శస్త్రచికిత్సకు అయిన మొత్తం డబ్బులను వడ్డీతో సహా బాధితుడి కుటుంబ సభ్యులకు తిరిగి చెల్లించాలని వైద్యుడిని ఆదేశించింది.

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రి వైద్యుడు చేసిన తప్పునకు.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. వైద్యుని తప్పిదం వల్లే రోగి చనిపోయాడని నిర్ధరించి శస్త్రచికిత్సకు అయిన మొత్తం డబ్బులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని తీర్పు వెలువరించింది.

ఏంటీ కేసు..?

2011లో ఖేడా జిల్లాకు చెందిన దేవంద్రభాయ్ అనే వ్యక్తికి విపరీతంగా నడుం నొప్పిరావటం వల్ల వైద్యుడిని కలిశాడు. వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు.. కిడ్నీలో ఉన్న 14ఎంఎం రాయిని ఆపరేషన్‌ చేసి తొలగించాలని చెప్పాడు. 2011 సెప్టెంబర్ 3న ఆపరేషన్ చేసిన వైద్యుడు.. రాయికి బదులు కిడ్నీ తొలగించాడు. రోగి ప్రాణం కాపాడటానికే మూత్రపిండం తొలగించినట్లు నమ్మబలికాడు.

ఆపరేషన్‌ అయిన 8నెలలకే ఆరోగ్యం క్షీణించి బాధితుడు చనిపోయాడు. ఈ విషయమై మృతుడి కుటుంబీకులు.. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శస్త్రచికిత్సకు అయిన 11 లక్షల 23 రూపాయలను 2011 నుంచి ఇప్పటివరకు ఏడున్నర శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.