ETV Bharat / bharat

ఆశారాంకు మరోసారి జీవితఖైదు.. రేప్​ కేసులో శిక్ష

author img

By

Published : Jan 31, 2023, 5:02 PM IST

life imprisonment  Asaram to  in rape case
life imprisonment Asaram to in rape case

గుజరాత్​కు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూనకు గాంధీనగర్​ కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఆశారాం ఇప్పటికే ఓ రేప్​ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.

లైంగిక వేధింపుల కేసులో గుజరాత్​కు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూనకు గాంధీనగర్​ కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో గాంధీనగర్​ కోర్టు విచారణ చేపట్టింది. వాదులు, ప్రతివాదులకు సంబంధించిన 68 సాక్షులను విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న సెషన్స్​ కోర్టు జడ్జి డీకే సోని.. ఆశారాంను దోషిగా తేల్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మరో ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇందులో ఆశారాం భార్య లక్ష్మీబెన్​తో పాటు ఆమె కుమార్తె, నలుగురు శిష్యులు ఉన్నారు. అయితే, గాంధీనగర్​ సెషన్స్​ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆశారాం బాపు తరపు లాయర్​ తెలిపారు.

ఆశారాం తనపై అత్యాచారానికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001 నుంచి 2006 వరకు ఆశ్రమంలో ఉన్న తనపై బాపూ అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఆశారాం బాపూతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే అందులో ఒకరు మరణించారు.
ప్రస్తుతం మరో రేప్​ కేసులో 81 ఏళ్ల ఆశారాం బాపు.. రాజస్థాన్​ జోధ్​పుర్​లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2013లో ఓ మైనర్​పై అత్యాచారం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన జోధ్​పుర్ ట్రయల్​ కోర్టు.. 2018లో దోషిగా తేల్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.