ETV Bharat / bharat

దేశంలో మరో కొత్త వ్యాధి- ఒకేసారి నాలుగు కేసులు

author img

By

Published : Jul 27, 2021, 10:03 PM IST

Updated : Jul 28, 2021, 9:04 AM IST

Scrub Typhus
స్క్రబ్​ టైఫస్​

కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు అపరిశుభ్ర పరిసరాల్లో సంచరించే పురుగులకు సంభవించిన వ్యాధులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. హిమాచల్​ప్రదేశ్​లోని ఐజీఎంసీ​లో కొత్తగా నాలుగు స్క్రబ్​ టైఫస్​ కేసులు వెలుగుచూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యాధికి చికిత్స ఉందా? ఎలా నివారించాలి? లాంటి సమాచారం మీకోసం..

ఇప్పటికే కరోనాతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న వేళ హిమాచల్​ప్రదేశ్​లో కొత్తగా నలుగురు స్క్రబ్​ టైఫస్​ అనే వ్యాధి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇందిరాగాంధీ వైద్య కళాశాల(ఐజీఎంసీ) ఆస్పత్రి డా. జనక్ రాజ్ మంగళవారం వెల్లడించారు. స్క్రబ్ టైఫస్ సోకిన చిగ్గర్స్ (లార్వా పురుగులు) కాటు ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

Scrub Typhus
చిగ్గర్ కుడితే వచ్చే దద్దుర్లు

స్క్రబ్ టైఫస్ అంటే?

స్క్రబ్ టైఫస్​ను బుష్ టైఫస్​ అని కూడా అంటారు. ఓరియెన్​షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి కలుగుతుంది. ఈశాన్య ఆసియా, ఇండోనేషియా, చైనా, జపాన్, భారత్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తోంది.

లక్షణాలు..

Scrub Typhus
చిగ్గర్ కాటు

స్క్రబ్ టైఫస్ లక్షణాలు కూడా ఎన్నో ఇతర రోగాల లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. పురుగు కుట్టిన 10 రోజుల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడుతుంటాయి. అవి..

  • జ్వరం, చలి జ్వరం
  • తల నొప్పి
  • ఒళ్లు, కండరాల నొప్పులు
  • పురుగు కుట్టిన చోట నల్లటిమచ్చ
  • మానసిక మార్పులు (భ్రమ నుంచి కోమా వరకు)
  • ఒంటిపై ఎర్రటి దద్దుర్లు
  • తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అవయవాల వైఫల్యం, రక్తస్రావం జరిగి చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
    Scrub Typhus
    గోటిపై చిగ్గర్

చికిత్స ఎలా?

పై లక్షణాలు కనపడినా, ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో సంచరించినా ఆ సమాచారం వైద్యులకు వెల్లడించాలి. వైద్యులు.. రక్త పరీక్షలు చేయవచ్చు. టెస్టు రిపోర్టులు రావడానికి వారాల సమయం పడుతుంది. కాబట్టి అంతకన్నా ముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ చికిత్సలో డోక్సిసైక్లిన్ అనే యాంటీబయోటిక్ వాడతారు. అది అన్ని వయసుల వారికీ ఇవ్వొచ్చు. లక్షణాలు కనబడిన వెంటనే ఇది ఇస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

Scrub Typhus
సూది తల భాగంలో చిగ్గర్

నివారణ ఎలా?

స్క్రబ్​ టైఫస్ నివారణకు టీకా లేదు. వ్యాధి సోకిన చిగ్గర్స్​కు దూరంగా ఉండటం వల్ల దాని నుంచి తప్పించుకోవచ్చు. చిగ్గర్స్​ ఎక్కువగా ఉండే దట్టంగా ఉన్న పొదలు, అడువులకు వెళ్లకుండా ఉంటే మేలు.

ఒక వేళ మీరు బయట ఎక్కువగా తిరుగుతున్నట్లు అయితే..

  • డీఈఈటీ లాంటి శక్తివంతమైన పదార్థాలు కలిగిన కీటక నాశిని(ఇన్​సెక్ట్​ రిపెల్లంట్​) ద్రవాలను చిగ్గర్స్​పై పిచికారీ చేయాలి.
  • చర్మానికి రాసుకునేవాటిని సూచనల ఆధారంగా వాడాలి.
  • సన్​స్క్రీన్​ లోషన్​ లాంటివి పెట్టుకున్న తర్వాతే ఇన్​సెక్ట్​ రిపెల్లంట్​లను పూసుకోవాలి.

చిన్నపిల్లలుంటే..

  • చేతులు, కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే బట్టలు వేయాలి. ఉయ్యాలలో ఉంటే దోమ తెరలు వాడాలి.
  • చిన్నారుల చేతులు, కళ్లు, నోరు, శరీరంపై పగుళ్లు, చర్మ సమస్యలుంటే రిపెల్లంట్​లను నేరుగా పూయొద్దు.
  • పెద్దలైతే ఇన్​సెక్ట్​ రిపెల్లంట్​ను ముందుగా చేతుల్లో స్ప్రే చేసిన తర్వాత మొహానికి రాసుకోవాలి.

పెరిమిత్రిన్..

పెరిమిత్రిన్.. చిగ్గర్స్​ను చంపుతుంది. బూట్లు, బట్టలపై దానిని పిచికారీ చేస్తే పురుగులు రాకుండా ఉంటాయి. పెరిమిత్రిన్​ను నేరుగా చర్మంపై వాడకండి.

ఇదీ చూడండి: అది..డెంగీ కాదు.. మలేరియా కాదు.. కానీ డేంజర్!

Last Updated :Jul 28, 2021, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.