ETV Bharat / bharat

రాజకీయ పార్టీని ప్రకటించిన రైతు నేత గుర్నామ్​ సింగ్​

author img

By

Published : Dec 18, 2021, 3:49 PM IST

సంయుక్త కిసాన్​ మోర్చా సభ్యుడు, సాగు చట్టాలపై ఏడాదికిపైగా పోరాటం చేసిన రైతు నేత గుర్నామ్​ సింగ్ చఢూనీ.. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

farmer leader gurnam chaduni
రైతు నేత గుర్నామ్​ సింగ్​

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలం పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్​ మోర్చా కీలక సభ్యుడు, హరియాణా కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు గుర్నామ్ ​సింగ్​ చఢూనీ.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ పేరును సంయుక్త సంఘర్ష్​ పార్టీగా తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్​ శాసనసభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

పంజాబ్​ రాజధాని చండీగఢ్​లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించారు గుర్నామ్​ సింగ్​ చఢూనీ.

" సంయుక్త సంఘర్ష్​ పార్టీని ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. రాజకీయాలను ప్రక్షాళన చేయటం సహా మంచి వారికి అవకాశం కల్పించటమే మా పార్టీ లక్ష్యం. "

- గుర్నామ్​ సింగ్​ చఢూనీ, రైతు నేత

రాజకీయాల ప్రక్షాళనే ధ్యేయం..

ఈ సందర్భంగా రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు సింగ్. రాజకీయాలు కలుషితమైపోయాయని.. మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడిదారులకు నాయకులు కొమ్ముకాస్తూ.. వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్నారని తెలిపారు. సామాన్యూడికి, పేదవారి కోసం ఏమీ చేయటం లేదని, రైతులను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకోసమే కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు.

మీరు పోటీ చేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పిన ఆయన.. పార్టీ 117 స్థానాల్లో బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రాష్ట్రంలోని రైతు సంఘాలను కోరారు.

ఇదీ చూడండి: Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.