ETV Bharat / bharat

ఫుడ్ డెలివరీ బాయ్స్​ ముసుగులో డ్రగ్స్ దందా

author img

By

Published : Oct 22, 2021, 7:14 PM IST

Updated : Oct 22, 2021, 7:49 PM IST

ఫుడ్ డెలివరీ బాయ్స్​ ముసుగులో డ్రగ్స్ దందా

ఫుడ్ డెలివరీ బాయ్స్ అని చెబుతూ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని బెంగళూరులోని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.60లక్షలు విలువ చేసే డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరులోని సెంట్రల్​ క్రైం బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఫుడ్​ డెలీవరీ బాయ్స్ ముసుగులో వీరు కస్టమర్లకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. వీరి వద్ద ఉన్న రూ.60లక్షలు విలువ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ఇద్దరినీ ఝార్ఖండ్​కు చెందిన రవి, రవి ప్రకాశ్​గా పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని బెళ్లందూర్​లో ఓ హాస్టల్​లో వీరు ఉంటున్నట్లు తెలిపారు.

కళాశాల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గతనెలలో దాడులు చేసి పట్టుకుంది సీసీబీ ఇన్​స్పెక్టర్​ బీఎస్ అశోక్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం. విచారణలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు రవి, రవి ప్రకాశ్​లను పోలీసులు పట్టుకున్నారు.

Drugs supply in the form of food delivery: Two arrested in Bengaluru
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​

దిల్లీకి చెందిన డ్రగ్ పెడ్లర్​ ముఠాలో వీరిద్దరూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. డార్క్​​ నెట్లో విదేశాల నుంచి డ్రగ్స్​ కొనుగులు చేసి బిట్​ కాయిన్​ రూపంలో డబ్బులు చెల్లిస్తున్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రవి, రవిప్రకాశ్​లకు అతడు పోస్టులో బర్త్​డే గిఫ్ట్​ ప్యాక్​లా డ్రగ్స్ చేర్చేవాడు. అనంతరం వీరిద్దరూ కస్టమర్లకు వాటిని సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఫుడ్​ డెలీవరీ సంస్థల ప్యాకింగ్ కవర్లను ఉపయోగిస్తున్నారు.

Drugs supply in the form of food delivery: Two arrested in Bengaluru
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​

ఇద్దరి నుంచి 300 డ్రగ్ ట్యాబ్లెట్లు, 350 గ్రాముల చరాస్​, 1.5కేజీ హైడ్రో గంజా, గిఫ్ట్ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి పోలీసు కస్టడీలోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

Drugs supply in the form of food delivery: Two arrested in Bengaluru
పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​

ఇదీ చదవండి: 3 నెలల మనవడిని హత్య చేసిన అమ్మమ్మ.. ఆపై!

Last Updated :Oct 22, 2021, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.