ETV Bharat / bharat

జడ్జిని ఆటోతో ఢీకొట్టి హత్య- బెయిల్ ఇవ్వలేదనే!

author img

By

Published : Jul 29, 2021, 1:32 PM IST

Updated : Jul 29, 2021, 2:24 PM IST

Dhanbad judge death
జడ్జిని ఆటోతో ఢీకొట్టి చంపిన డ్రైవర్

జాగింగ్​ చేస్తుండగా.. జిల్లా జడ్జిని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టి చంపాడు ఓ ఆటోడ్రైవర్​. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మొదట 'హిట్ అండ్​ రన్​' కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తర్వాత విస్తుపోయే విషయాలు కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా ఆటో డ్రైవర్​ను అరెస్ట్ చేశారు.

జడ్జిని ఆటోతో ఢీకొట్టి హత్య

ఝార్ఖండ్​, ధన్​బాద్​ జిల్లా జడ్జి ఉత్తమ్​ ఆనంద్​ మృతి కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మొదట హిట్​ అండ్​ రన్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... చివరకు ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని ప్రాథమికంగా తేల్చారు.

అసలేం జరిగింది?

జిల్లా జడ్జి ఉత్తమ్​ ఆనంద్​.. బుధవారం తెల్లవారుజామున జాగింగ్​ చేస్తుండగా ఓ ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జడ్జి అక్కడికక్కడే మృతి చెందారు.

హిట్ అండ్​ రన్​ కేసుగా..

మొదట హిట్​ అండ్​ రన్​ కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కానీ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాక.. కావాలనే ఆనంద్​ను కావాలనే హత్యచేశారని నిర్ధరణకు వచ్చారు. ఆనంద్​ను ఢీకొట్టిన ఆటోడ్రైవర్​ను అరెస్ట్​ చేశారు.

సుప్రీంకోర్టులో ప్రస్తావన..

Dhanbad judge death
జడ్జిని ఆటోతో ఢీకొట్టి హత్య

ఈ కేసును సుప్రీంకోర్టులో ప్రస్తావించారు సుప్రీం లాయర్​ వికాస్ సింగ్​. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే విషయంపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి. రమణ.. ఝార్ఖండ్​ హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిందని తెలిపారు.

వాళ్ల పనేనా?

ప్రస్తుతం ఆనంద్.. బొగ్గు మాఫియాకు సంబంధించి రంజయ్​ సింగ్​ మర్డర్​ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులైన అభినవ్​ సింగ్​, రవి ఠాకూర్​ ఇటీవల బెయిల్​ కోసం చేసుకున్న దరఖాస్తును జడ్జి ఆనంద్ తిరస్కరించారు. దీంతో పథకం ప్రకారమే.. ఆనంద్​ను హత్యచేశారని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: వందల పాములతో ఊరేగింపు- మెడకు చుట్టుకుని ఆడిస్తూ...

Last Updated :Jul 29, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.