ETV Bharat / bharat

దిల్లీ పోలీసులపై కరోనా పంజా- 2,500 మందికి పాజిటివ్​

author img

By

Published : Jan 17, 2022, 4:11 PM IST

Delhi cops covid cases
Delhi cops covid cases

Delhi Police Corona: దిల్లీ పోలీసు విభాగంపై కరోనా పంజా విసురుతోంది. ఈ నెల ప్రారంభం నుంచి మొత్తం 2,500 మంది సిబ్బంది వైరస్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. 767 మంది కోలుకున్నట్లు పేర్కొన్నారు.

Delhi Police Corona: దిల్లీలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 2,500 మంది పోలీసులకు కొవిడ్​ సోకింది. వారిలో 767 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. బాధితుల్లో అన్ని ర్యాంకులకు చెందిన ఆఫీసర్లు ఉన్నారని స్పష్టం చేశారు.

అయితే వైరస్ బారిన పడిన సిబ్బంది.. కోలుకుని తమ విధుల్లో తిరిగి చేరుతున్నారని ఇటీవల కరోనాను జయించిన దిల్లీ పోలీసు ప్రతినిధి, అదనపు పోలీసు కమిషనర్​(క్రైమ్​ బ్రాంచ్​) చిన్మోయి బిశ్వాల్​ తెలిపారు. అర్హులైన సిబ్బందికి బూస్టర్‌ డోసు వేసేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ పూర్తికాని తమ కుటుంబ సభ్యులను టీకా తీసుకునే దిశగా ప్రొత్సహించాలని సూచించారు.

జైళ్లలో కొవిడ్​ వ్యాప్తి

దిల్లీ జైళ్లలో కొవిడ్‌ 19 వ్యాప్తి తీవ్రమవుతోంది. నగరంలోని వివిధ జైళ్లలో ఇప్పటివరకు 90 మందికిపైగా ఖైదీలు, 80 మందికిపైగా అధికారులకు కరోనా సోకింది. దీంతో దిల్లీలోని కారాగారాల్లోనే 50-100 పడకల మెడికల్‌ సెంటర్లను జైళ్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. కొవిడ్‌ సోకిన ఖైదీలకు అక్కడే చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ప్రధాని భద్రతా లోపం' విచారణ కమిటీ ఛైర్మన్​కు బెదిరింపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.