ETV Bharat / bharat

Cyber Criminals Harassment Young Man Committed Suicide: వీడియో కాల్​ను మార్ఫింగ్​ చేసిన సైబర్​ కేటుగాళ్లు.. బెదిరింపులతో యువకుడు ఆత్మహత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 4:21 PM IST

Young Man Committed Suicide
Cyber Criminals Harassment Young Man Committed Suicide

Cyber Criminals Harassment Young Man Committed Suicide: సైబర్​ కేటుగాళ్లకు మరో యువకుడు బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ యువకుడికి వాట్సాప్​లో ఓ యువతి వాట్సాప్​ వీడియో కాలింగ్​ చేస్తే.. ఆ కాల్​ను మార్ఫింగ్​ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు సైబర్​ నేరగాళ్లు. డబ్బులు ఇచ్చినా ఇంకా ఇవ్వాలంటూ బెదిరించి.. ఆ వీడియోను యువకుడి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపారు. దీనిపై తీవ్రమనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో జరిగింది.

Cyber Criminals Harassment Young Man Committed Suicide: ఈ మధ్య కాలంలో సైబర్​ నేరాలు(Cyber Crime Cases in Hyderabad) తారాస్థాయికి పెరిగిపోయాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతరం ముందుకు సాగుతుంటే.. ఆ సరికొత్త టెక్నాలజీనే మంత్రంగా వాడుకొని సైబర్​ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వీరి మీద ఎంత నిఘా పెట్టిన వారి అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఓ వైపు ఆన్​లైన్​లో డబ్బులు ఆశచూపడం, మరోవైపు తక్కువ ధరలకే వస్తువులు ఇస్తామంటూ లక్షల్లో కొల్లగొట్టడం, మరోవైపు లోన్​ యాప్​ల పేరుతో లక్షలు దోచుకొని.. తీరా వారి పర్షనల్​ ఇన్​ఫర్మేషన్​ను సామాజిక మాధ్యమాల్లో పెట్టి వారి మరణానికి కారకులు అవుతున్నారు. ఇలాంటి సైబర్​ ఘటనే హైదరాబాద్​లో జరిగింది. సైబర్​ నేరగాళ్ల బెదిరింపులు భరించలేక యువకుడు(Young Man Suicide Cyber Criminals Harassment) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన ఓ యువకుడు బీటెక్​ పూర్తి చేసుకొని.. కంప్యూటర్​ కోర్సు శిక్షణ కోసం నెల రోజుల కిందట అమీర్​పేటకు వచ్చాడు. అక్కడ ఎస్సార్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ బాయ్స్​ హాస్టల్​లో ఉంటూ రోజూ శిక్షణకు వెళ్లేవాడు. తనతో పాటు మరో నలుగురు యువకులు కూడా అదే గదిలో కలసి ఉండేవారు. ఇటీవల అతనికి ఓ యువతి వాట్సాప్​లో ఓ వీడియో కాల్​ చేసి మాట్లాడింది. అంతే అంతలోనే ఆ యువకుడికి అటువైపు ఓ మెసెజ్​ వచ్చింది. సైబర్​ నేరగాళ్లు ఆ కాల్​ రికార్డును నగ్న వీడియోగా మార్ఫింగ్​ చేసి పంపించారు. అది చూసి ఆ యువకుడు ఒక్కసారిగా కంగుతున్నాడు.

వాట్సాప్​లో చిన్నారుల పోర్న్​వీడియోస్​ వైరల్​.. నిందితుడిని గుర్తించిన అమెరికా దర్యాప్తు సంస్థ

Cyber Crimes in Hyderabad: వెంటనే సైబర్​ కేటుగాళ్లు నుంచి యువకుడికి ఫోన్​ వచ్చి.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిస్తాంటూ బెదిరించారు. వెంటనే ఆ యువకుడు ఒకసారి రూ.10 వేలను వారికి పంపించాడు. వారు మరింత మొత్తంలో డబ్బులు కావాలంటూ వేధించారు. ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని చెప్పిన వినకుండా.. ఆ మార్ఫింగ్​ చేసిన నగ్న వీడియోలను యువకుడి మిత్రులకు పంపించారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురై.. హాస్టల్​ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇది గుర్తించిన తన రూమ్​మేట్స్.. హాస్టల్​ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి కాల్స్​ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ యువతి,యువకులకు విజ్ఞప్తి చేశారు. బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Loan App Harassment Hyderabad : లోన్​ యాప్​ డౌన్​లోడ్ చేసుకుంటున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రదర్​!

Cyber Crime Cases in Hyderabad : లైక్​ కొడితే రూ.200 అని ఆశచూపి.. రూ.59 లక్షలు దోచేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.