ETV Bharat / bharat

భారత్​లో ఒక్కరోజే 4 లక్షల కరోనా టెస్టులు.. 20 వేల కేసులు.. జపాన్​లో 2 లక్షలకుపైనే..

author img

By

Published : Jul 29, 2022, 9:55 AM IST

covid cases in india
కొవిడ్ కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 20,409 మంది వైరస్ బారిన పడగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్​లో కొత్తగా 2 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 20,409 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 22,697 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,39,79,730
  • మొత్తం మరణాలు: 5,26,258
  • యాక్టివ్​ కేసులు: 1,43,988
  • కోలుకున్నవారి సంఖ్య: 4,33,09,484

Vaccination India: భారత్​లో గురువారం 38,63,960 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 203.60 కోట్లు దాటింది. మరో 3,98,761 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 9,26,447 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,028 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,93,87,454కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,14,119 మంది మరణించారు. ఒక్కరోజే 8,50,731 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య54,93,36,123కు చేరింది.

  • జపాన్​లో 2,07,236 కేసులు నమోదు కాగా.. 122 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 93,216 కేసులు నమోదు కాగా.. 260 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 88,296 మందికి కరోనా సోకింది. 25 మంది బలయ్యారు.
  • జర్మనీలో తాజాగా 84,798 మందికి కరోనా సోకింది. 153 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 60,381 మందికి వైరస్​ సోకగా.. 199 మంది మరణించారు.

ఇదీ చూడండి : రైల్లో అర్ధరాత్రి పాము హల్​చల్.. బెంబేలెత్తిన ప్రయాణికులు.. ట్రైన్​ను నిలిపివేసినా..

మతాంతర వివాహం.. కూతురు, అల్లుడిని ఆటో ఢీకొట్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.