ETV Bharat / bharat

Court Verdict After 31 Years : 31 ఏళ్ల నాటి కేసులో తీర్పు.. 9 మందికి జీవిత ఖైదు.. విచారణలోనే 36 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 8:38 PM IST

Court Sentence Life Imprisonment After 31 Years
Court Sentence Life Imprisonment After 31 Years

Court Verdict After 31 Years : 31 సంవత్సరాల నాటి కేసులో 9 మందికి జీవిత ఖైదు విధించింది రాజస్థాన్​లోని భరత్​పుర్ కోర్టు. మరో 45 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ సుదీర్ఘంగా జరిగిన విచారణ సమయంలో 36 మంది చనిపోయారు. అసలేం జరిగిందంటే?

Court Verdict After 31 Years : 31 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓ కేసులో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ రాజస్థాన్​లోని భరత్​పుర్​ ఎస్​సీ/ఎస్​టీ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. మరో 41 మందిని నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో 36 మంది నిందితులు చనిపోయారు.

ఇదీ జరిగింది..
జిల్లాలోని కుమ్​హెర్​ ప్రాంతంలో 1992 జూన్​ 6న స్థానికంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 45 మందికి గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. మొదట ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. దర్యాప్తు క్రమంలో మొత్తం 283 మంది సాక్షులను సీబీఐ విచారించింది. వారి వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 87 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు సీబీఐ అధికారులు.

అయితే 31 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణలో 36 మంది నిందితులు మరణించారు. ఇన్నేళ్ల పాటు వాదోపవాదాలు జరిగాక.. తాజాగా శనివారం ఎస్​సీ/ఎస్​టీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సమయంలో కోర్టుకు 50 మంది నిందితులు హాజరయ్యారు. ఇందులో 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గిర్జా భరద్వాజ్​ తీర్పు వెలువరించారు. మిగతా 41 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల్లో రామ్​ సింగ్, మంకలమ్​ జైన్, బేదో, జయ్​ సింగ్, భన్​వర్​ సింగ్, శివ్​ సింగ్​ కుమారుడు రామ్ సింగ్, ఫౌడీ సింగ్, గిర్​రాజ్​, గోపాల్​ ఉన్నట్లు న్యాయవాది రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.

రూ.2 లంచం .. 37 ఏళ్లు విచారణ.. నిర్దోషులుగా బయటపడ్డ ఐదుగురు పోలీసులు
Five Police man Acquitted After 37 Years : రెండు రూపాయలను అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నిర్దోషులుగా తేలారు. సరైన సాక్షాధారాలు లేని కారణంగా ఆ ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. 1986లో జరిగిన ఘటనపై.. బిహార్​లోని ఓ కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. వాహనదారుల నుంచి పోలీసులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండగా.. అప్పటి బెగుసరాయ్ జిల్లా ఎస్పీ వీరిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Farmers Built Bridge On Krishna River : కృష్ణానదిపై సొంతంగా బ్రిడ్జి నిర్మించిన రైతులు.. చందాలు వేసుకుని మరీ..

Murrah Buffalo Dharma : ఏజ్​ 3ఏళ్లు.. డైలీ 15లీటర్ల పాలు.. అందాల పోటీల్లో ఎన్నో ప్రైజ్​లు.. రాష్ట్రంలో అందమైన గేదె ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.