ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో ఆగని ఉద్ధృతి

author img

By

Published : Sep 2, 2022, 9:23 AM IST

corona cases in india
corona cases in india

Corona Cases in India : భారత్​లో కొత్తగా 6,168 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి 21 మంది బలయ్యారు. ఒక్కరోజులో 9,685 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,168 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 21 మంది మరణించారు. ఒక్కరోజులో 9,685 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.14 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,22,246
  • క్రియాశీల కేసులు: 59,210
  • మొత్తం మరణాలు: 5,27,932
  • కోలుకున్నవారు: 4,38,55,365

Vaccination In India : దేశంలో గురువారం 22,40,162 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,12,75,23,421 కు చేరింది. ఒక్కరోజే 3,18,642 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 590,784 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,751 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 607,922,595కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,498,279 మంది మరణించారు. గురువారం మరో 756,063 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 584,827,732కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 167,340 కేసులు వెలుగుచూశాయి. మరో 316 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 81,499 కొవిడ్​ కేసులు,112 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 65,815 కొత్త కేసులు, 272 మరణాలు వెలుగుచూశాయి.
  • రష్యా, ఇటలీ, జర్మనీ, తైవాన్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి: టీ పొడికి 'గోల్డ్'​ టచ్.. కిలో ధర రూ.2.5 లక్షలు

భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.