ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​ ఫేజ్-2 పోలింగ్​- 70 శాతానికి పైగా ఓటింగ్​- రెచ్చిపోయిన నక్సల్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 8:05 AM IST

Updated : Nov 17, 2023, 11:05 PM IST

chhattisgarh election 2023 polling live updates today
chhattisgarh election 2023 polling live updates today

17:00 November 17

ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం 5 గంటల వరకు 70.59 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలీసులు, పారామిలిటరీ దళాల పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్ సాగింది. నక్సల్ ప్రభావిత గరియాబంద్ జిల్లా బింద్రనవాగఢ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతంలో పోలింగ్ మధ్యాహ్నం 3 వరకే కొనసాగింది. కమర్​భౌడి, అమమోరా, ఓధ్, బడే గోబ్రా, గన్​వార్​గావ్, గరిబా, నాగేశ్, సాబిన్​కచార్, కోడోమలి పోలింగ్ బూత్​లలో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.

ఛత్తీస్​గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. తొలి విడతలో 20 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. తన సొంత నియోజకవర్గమైన పాటన్​లోని కురుద్దీ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాటన్​లో పోటీ ఏకపక్షమేనని బఘేల్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 75కు పైగా సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఛత్తీస్​గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సివిల్ లైన్స్ రాయ్​పుర్​లో ఓటు వేశారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న.. డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ (అంబికాపుర్), రాష్ట్ర మంత్రులు రవీంద్ర చౌబే(సజా), అనిలా భేడియా (దోండిలోహరా), అమర్​జీత్ భగత్ (సీతాపుర్), జైసింగ్ అగర్వాల్, అసెంబ్లీ స్పీకర్ చరణ్​దాస్ మహంత్ (సక్తీ) తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న బీజేపీ చీఫ్, ఎంపీ అరుణ్ సావ్.. బిలాస్​పుర్​లో, కేంద్ర మంత్రి రేణుకా సింగ్.. ప్రేమ్​నగర్​లో ఓటేశారు.

గుండెపోటుతో మృతి
బలౌదాబాజార్ జిల్లా కస్​డోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. అనంతరం.. బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ బయట ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు, కోరియా జిల్లాలో ఓటేసేందుకు వస్తున్న ఓ వ్యక్తి... ఏనుగు దాడిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

పలు ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్​ను బహిష్కరించారు. తమ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని ఆరోపిస్తూ ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. గ్రామంలో రోడ్లు నిర్మించలేదని రాయ్​గఢ్ జిల్లాలోని తెంతగుడ్డి గ్రామ ప్రజలు ఓటింగ్​ను బహిష్కరించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఓటింగ్​కు రాబోమని స్పష్టం చేశారు. బిలాస్​పుర్ జిల్లా, మస్తూరీ సెగ్మెంట్​లోని మాణిక్​పుర్ ధేన్​కా గ్రామ ప్రజలు సైతం ఓటు వేయడానికి నిరాకరించారు. తమ గ్రామంలో రోడ్ల నిర్మాణం సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులతో మాట్లాడి ఓటింగ్​కు ఒప్పించేందుకు అధికారులను పంపించినట్లు బిలాస్​పుర్ కలెక్టర్ అవనీశ్ శరణ్ తెలిపారు.

రెచ్చిపోయిన నక్సల్స్​- ఒకరు మృతి!
పోలింగ్​లో పాల్గొన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు నక్సలైట్లు. ఇందుకోసం ఐఈడీ పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్​ ప్రాణాలు కోల్పోయారు.
రెండో విడత పోలింగ్​లో భాగంగా ఏర్పాటు చేసిన బడే గోబ్రా పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. విధుల నుంచి తిరిగి వస్తున్న భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ పేలుడు ధాటికి అటుగా వెళ్తున్న ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ జోగిందర్ సింగ్ మరణించారని రాయ్‌పుర్ ఐజీ రేంజ్ ఆరిఫ్ షేక్ తెలిపారు. విధుల్లో పాల్గొన్న మిగతా సిబ్బంది సహా పోలింగ్ సామగ్రిని సురక్షితంగా గరియాబంద్‌కు చేర్చినట్లుగా ఆయన చెప్పారు.

15:49 November 17

మధ్యాహ్నం 3 గంటల వరకు ఛత్తీస్​గఢ్​లో 55.31 శాతం ఓటింగ్ నమోదైంది.
అక్కడ ముగిసిన పోలింగ్
నక్సల్ ప్రభావిత గరియాబంద్ జిల్లా బింద్రనవాగఢ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతంలో పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు కొనసాగింది. కమర్​భౌడి, అమమోరా, ఓధ్, బడే గోబ్రా, గన్​వార్​గావ్, గరిబా, నాగేశ్, సాబిన్​కచార్, కోడోమలి పోలింగ్ బూత్​లలో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.

15:46 November 17

మహిళ మృతి
బలౌదాబాజార్ జిల్లా కస్​డోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. అనంతరం.. బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ బయట ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

14:00 November 17

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ దుర్గ్‌ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 75 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

13:56 November 17

ఛత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.22 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

11:46 November 17

ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాయ్‌పుర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

11:38 November 17

ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 19.65% పోలింగ్​ శాతం నమోదైంది.

09:55 November 17

ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 5.71 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

08:22 November 17

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్​ సావో.. బిలాస్​పుర్​లో ఓటేశారు.

08:13 November 17

ఛత్తీస్​గఢ్​లో జరుగుతున్న రెండో దశ ఎన్నికల పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. "ఈరోజు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండో రౌండ్ ఓటింగ్. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నాను. మన ప్రజాస్వామ్య సంప్రదాయాలు, పద్ధతులను నిలబెట్టడానికి మీ ప్రతి ఒక్క ఓటు చాలా అవసరం" అని మోదీ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

06:43 November 17

ఛత్తీస్​గఢ్​లో పోలింగ్

Chhattisgarh Election 2023 : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. ఈనెల 7న 20నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది. 22 జిల్లాల పరిధిలో ఉన్న మిగతా 70స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే నక్సల్స్‌ ప్రభావిత రాజిమ్‌ జిల్లాలోని బింద్రనవాగఢ్‌ స్థానంలోని 9పోలింగ్‌ బూత్‌ల్లో మాత్రం ఉదయం 7గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది.

రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో 827మంది పురుషులు కాగా, 130మంది మహిళలు, ఒక ట్రాన్స్‌ జెండర్‌ ఉన్నారు. మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 81,41,624 మంది పురుషులు, 81,72,172 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 684 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

Last Updated :Nov 17, 2023, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.