ETV Bharat / bharat

ఎన్నికల కౌంటింగ్​కు ఛత్తీస్​గఢ్​ రెడీ- అధికార పీఠం ఎవరిదో?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 3:44 PM IST

Chhattisgarh Election 2023 Counting
Chhattisgarh Election 2023 Counting

Chhattisgarh Election 2023 Counting : ఛత్తీస్‌గఢ్‌లో ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు జరిగిన 90 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఏర్పాటు చేసిన 14 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కవర్ధా నియోజకవర్గంలో అత్యధికంగా 30రౌండ్లు, మనేంద్రగఢ్‌లో అత్యల్పంగా 12రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

Chhattisgarh Election 2023 Counting : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కంపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. నవంబర్‌ 7న నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన 20 స్థానాలకు తొలి విడతలో, మిగిలిన 70 స్థానాలకు నవంబర్‌ 17న రెండో విడతలో పోలింగ్‌ జరిగింది.

ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కవర్ధాలో అత్యధికంగా 30 రౌండ్లలో మనేంద్రగఢ్‌లో అత్యల్పంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుందని అధికారులు వెల్లడించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రధానాధికారి రీనా బాబా సాహెబ్ తెలిపారు. ఓటింగ్‌ కేంద్రం వద్దకు ఇతరులు ఎవరూ రాకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్దఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు.

90 శాసనసభ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్ కూడా హస్తం పార్టీకే అధికారమని అంచనాలు ప్రకటించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 68, బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించాయి. 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ పాలనకు 2018లో కాంగ్రెస్‌ తెరదించింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 ఉండగా మోజార్టీ మార్కు 46 వచ్చిన పార్టీ అధికారం చేపట్టనుంది.

రెండు విడతల్లో ఎన్నికలు..
ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా తొలి విడతలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. తొలి విడతలో నక్సల్​ ప్రభావిత బస్తర్​ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగ్గా 70.87 శాతం పొలింగ్​ నమోదైంది. రెండో విడతలో 70.59 శాతం ఓటింగ్ నమోదైంది.

Bastar Maoist Affected Areas : 'బస్తర్​' మే సవాల్​.. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి పోలింగ్ కేంద్రాలు.. భారీ భద్రత

BJP Tough Seats In Chhattisgarh : ఆ 9 స్థానాలే టార్గెట్​.. 23 ఏళ్లుగా గెలవని బీజేపీ.. ఈసారి పక్కా ప్లాన్​తో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.