ETV Bharat / bharat

ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన చంద్రబాబు, ఒకరోజు ఉండే అవకాశం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 3:56 PM IST

Updated : Nov 2, 2023, 7:59 PM IST

chandrababu latest news
Chandrababu Medical Checkups at AIG Hospital

Chandrababu Medical Checkups at AIG Hospital : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. స్కిల్​ కేసులో అనారోగ్య కారణాలరీత్యా మధ్యంతర బెయిల్​ పొందిన చంద్రబాబు.. నిన్న జూబ్లిహిల్స్​లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇవాళ ఆసుపత్రికి వెళ్లారు.

Chandrababu Medical Checkups at AIG Hospital : స్కిల్​ కేసులో మధ్యంతర బెయిల్​పై విడుదలై హైదరాబాద్ వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కోర్టు ఆయనకు మంగళవారం మధ్యంతర బెయిల్ పొందారు. నిన్న గన్నవరం నుంచి హైదరాబాద్​కు చేరుకున్న చంద్రబాబును జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలోనే ఏఐజీ వైద్యుల బృందం కలిసింది. చంద్రబాబు తాజా ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం టీడీపీ అధ్యక్షుడు చెప్పిన వివరాలను పరిశీలించిన తరువాత... ఇవాళ ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవల్సిందిగా డాక్టర్ల బృందం సలహా ఇచ్చింది. ఈ మేరకు చంద్రబాబు ఇవాళ ఆసుపత్రికి వెళ్లారు. ఏఐజీ వైద్య పరీక్షల అనంతరం వారి సూచన మేరకు ఆస్పత్రిలో అడ్మిట్​ అయ్యారు. చంద్రబాబు ఒక రోజు ఏఐజీ ఆస్పత్రిలో ఉండే అవకాశం ఉంది.

మేము సైతం బాబు కోసం చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్​లో అపూర్వ స్వాగతం అడుగడుగునా నీరాజనం

Chandrababu Health Issues : రాజమండ్రి జైలులో అసౌకర్యాలతో.. చంద్రబాబు తీవ్ర ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు.. ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఓ నివేదికలో వివరించారు. కంటిలో శుక్లాలు ఏర్పడ్డాయని.. ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున 3 నెలల్లో కుడి కంటి శుక్లానికి కూడా సర్జరీ చేయాలని సూచించారు. అది కూడా ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ను మేనేజ్‌ చేస్తూ, గ్లకోమా వైద్య నిపుణుల పర్యవేక్షణలో, అన్ని వసతులూ ఉన్న ఐ ఇనిస్టిట్యూట్‌లోనే చేయాల్సి ఉంటుందని తెలిపారు. జైలులో ఉన్న సమయంలో కంటి సమస్య మరింత ఎక్కువైంది.

అదే విధంగా చంద్రబాబు చర్మసంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు కూడా జైలులో ఉన్నప్పుడు ఆయనను పరీక్షించిన ప్రభుత్వ వైద్య నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. బాబు వెన్ను కింది భాగంలో నొప్పి, ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని (Chandrababu Skin Allergy) ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనకు కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్, రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు, లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌లు, సీరం ఎలక్ట్రోలైట్స్, కోగ్యులేషన్‌ ప్రొఫైల్, ఎహెబీఏ1సీ , కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్, ఈసీజీ, ఎక్స్‌-రే చెస్ట్, 2డీ ఎకో వంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నివేదికను పరిశీలించిన తరువాత కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. నిన్న హైదరాబాద్ వచ్చిన టీడీపీ అధినేత.. ఇవాళ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

APCID Registered Another Case Against CBN : మరోవైపు చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ.. ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అక్రమ పాలసీలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ.. వెంకటరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమ పేర్లను నమోదు చేశారు.

Chandrababu Go To Hyderabad Today: అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'

Last Updated :Nov 2, 2023, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.