ETV Bharat / bharat

'అఫ్గానిస్థాన్​ కేంద్రంగా పాక్ ఉగ్ర కార్యకలాపాలు'

author img

By

Published : Jun 3, 2020, 9:45 AM IST

UN report vindicates India's position that Pakistani terrorists operate in Afghanistan: MEA
'అఫ్గానిస్థాన్​ కేంద్రంగా పాక్ యథేచ్చగా ఉగ్రకార్యకలాపాలు'

అఫ్గానిస్థాన్​ కేంద్రంగా పాకిస్థాన్​ ఉగ్ర కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదికలో తేలినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తీవ్రవాదానికి పాకిస్థాన్​ కేంద్రబిందువైందని భారత్​ చాలా కాలంగా చెబుతోందని, ఈ నివేదికతో ఇప్పుడు మళ్లీ రుజువైందని పేర్కొంది.

అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్​ కేంద్రబిందువైందని తమ దేశం చాలాకాలంగా చెబుతూనే ఉందని, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నివేదికతో ఆ విషయం రుజువైందని భారత విదేశీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అఫ్గానిస్థాన్​లో 6,500 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పాక్​ ప్రభుత్వం మద్దతు తోనే ఇది జరుగుతోందని పేర్కొంది.

ప్రపంచ శాంతికి ముప్పు, అఫ్గానిస్థాన్​ భద్రత, స్థిరత్వానికి సంబంధించిన అంశాలపై ఐరాస భద్రతా మండలి నివేదిక రూపొందించింది. నిషిద్ధ అల్​ఖైదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు అఫ్గానిస్థాన్​లో యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆ నివేదిక తేల్చిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ ఉగ్రవాదులు సహా, పాకిస్థాన్​కు చెందిన 6,500 మంది ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాక్​ అండతోనే ఇక్కడ ఉగ్రవాదలకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తామని అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీని పాకిస్థాన్ విస్మరించిందని శ్రీవాస్తవ అన్నారు. ఐరాస భద్రతా మండలి, ఫైనాన్షియల్ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​ తీర్మానాలను అమలు చేయడంలో పాక్​ పూర్తిగా విఫలమైందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.