ETV Bharat / bharat

సామాజిక మాధ్యమాల్లో రాహుల్ మాటామంతి

author img

By

Published : Jul 14, 2020, 7:18 AM IST

rahul
సామాజిక మాధ్యమాల్లో రాహుల్ అభిప్రాయాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో మరింత యాక్టివ్ కానున్నారు. ఆయన ఆలోచనలను వీడియో రూపంలో పంచుకునేందుకు నిర్ణయించారు. కరెంట్ ఎఫైర్స్, చరిత్ర, సంక్షోభంపైన సత్యాలను పంచుకోనున్నట్లు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల్లో మరింత యాక్టివ్ కానున్నారు. ఆయన ఆలోచనలు, ప్రస్తుత పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన విషయాలను వీడియో రూపంలో ప్రజలకు వివరించనున్నారు. టీవీలు, ఫోన్లలో విద్వేషపూరిత ప్రసంగాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అసత్య కథనాలు భారత్​ను విడదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్.

"మన దేశంలో తాజాగా నెలకొన్న పరిణామాలు, చరిత్ర, కరోనా సంక్షోభంపై మన దృక్పథాన్ని మార్చివేసే లక్ష్యంతో పలు వీడియోలు షేర్ చేస్తాను. మంగళవారం నాటి నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాం. ప్రస్తుతం భారత మీడియా నియంతృత్వానికి కట్టబడి పని చేస్తోంది. టీవీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. వాట్సాప్​ల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఈ విధమైన అబద్ధపు ప్రకటనలు దేశాన్ని రెండుగా చీలుస్తాయి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ప్రజలతో నేరుగా సంభాషించేందుకు ఇటీవల టెలిగ్రామ్ అకౌంట్​ను ప్రారంభించారు రాహుల్.

ఇదీ చూడండి: మంత్రి తనయుడి కారు ఆపడమే ఆ పోలీస్​ తప్పా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.