ETV Bharat / bharat

పది నిమిషాల్లోనే ప్రత్యేక రైళ్ల టికెట్లు సేల్​!

author img

By

Published : May 11, 2020, 7:32 PM IST

IRCTC news
10 నిముషాల్లోనే రైళ్లలోని టికెట్లన్నీ ఖాళీ!

లాక్​డౌన్​ ఆంక్షల సడలింపు తర్వాత ప్రారంభమైన రైలు సేవలకు భారీ డిమాండ్​ ఏర్పడింది. మంగళవారం హావ్​డా నుంచి దిల్లీ వెళ్లనున్న రైలులోని ఏసీ టైర్​-1, టైర్​-3 టికెట్లు 10 నిమిషాల్లో అమ్ముడైపోయాయి.

మే 12 నుంచి మొదలుకానున్న రైలు సర్వీసులకు టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం మొదలవగా.. కేవలం 10 నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయిపోయాయి. నాలుగు గంటలకే బుకింగ్‌ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ... కొన్ని కారణాల వల్ల ఆరు గంటలకు బుకింగ్‌ ప్రారంభించారు. ఇందులో హావ్​డా నుంచి దిల్లీ వెళ్లే రైలు టికెట్లను పెట్టగా... ఏసీ టైర్​-1, టైర్​-3 టికెట్లు వెంటనే అమ్ముడైపోయాయి. ఈ రైలు మంగళవారం సాయంత్రం 5గంటల 5 నిమిషాలకు హావ్​డా నుంచి బయల్దేరనుంది.

భువనేశ్వర్​-దిల్లీ రైలులోని ఏసీ కోచ్​ల టికెట్లు అరగంటలో సేల్​ అయిపోయాయి.

  • 90 నిమిషాలు ముందే రావాలి:

మంగళవారం నుంచి 15 రైళ్లు ప్రారంభించాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ-టికెట్లు కన్‌ఫర్మ్‌ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతించనున్నారు. అందరూ తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 90 నిమిషాలు ముందుగానే స్టేషన్​కు రావాలి. ఆహారం, దుప్పటి వంటి సేవలను అందజేయరు. ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలి.

కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతించనున్నారు. ప్రయాణికుల కోసం స్టేషన్‌, కోచ్‌ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద హ్యాండ్‌ శానిటైజర్లు పెట్టనున్నారు. బోర్డింగ్‌, కోచ్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో భౌతికదూరం పాటించాలి. ప్రయాణికుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించనున్నారు.

ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నాక ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది కేంద్రం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.