ETV Bharat / bharat

భారత్​ చెంతకు తొలి 'రఫేల్​'.. రాజ్​నాథ్​సింగ్ చక్కర్లు

author img

By

Published : Oct 8, 2019, 7:40 PM IST

Updated : Oct 8, 2019, 8:09 PM IST

రఫేల్ యుద్ధవిమానానికి రాజ్​నాథ్​సింగ్ ఆయుధపూజ

ఫ్రాన్స్ సంస్థ డసో ఏవియేషన్​ మొదటి రఫేల్ యుద్ధ విమానాన్ని ఇవాళ భారత్​కు అప్పగించింది. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్వయంగా ఈ యుద్ధ విమానాన్ని అందుకున్నారు. ఇవాళ దసరా పండుగతో పాటు 87వ వాయుసేనా దినోత్సవం పురస్కరించుకుని రఫేల్​కు ఆయుధపూజ నిర్వహించారు. రఫేల్​ రాకతో భారత వాయుసేన బలం మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

భారత్​ చెంతకు తొలి 'రఫేల్​'.. రాజ్​నాథ్​సింగ్ చక్కర్లు

భారత వైమానికదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్ రూపొందించిన రఫేల్ యుద్ధ విమానం భారత్ చేతికి అందింది. ఫ్రాన్స్​లోని బోర్డియాక్స్​లో డసో ఏవియేషన్ కర్మాగారంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ రఫేల్​ను అధికారికంగా స్వీకరించారు. రఫేల్‌ అందిన ఈ రోజు చరిత్రాత్మకమైనదిగా రాజ్​నాథ్​ అభివర్ణించారు.

"భారత భద్రతాదళాలకు ఇది చరిత్రాత్మకమైన రోజు. భారత్, ఫ్రాన్స్‌ సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుంది. భారత్‌లో ఈ రోజు దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను నిర్వహించుకుంటాం. ఈరోజు వాయుసేన 87వ దినోత్సవం కూడా. అందువల్ల ఈ రోజు అనేక రూపాల్లో ప్రత్యేకమైనది. రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌కు నిర్దేశిత సమయంలోనే అందినందుకు నాకు సంతోషం కల్గుతోంది. ఈ విమానం భారత వాయుసేన శక్తిని పెంచుతుంది. వాయుసేనను సమర్ధంగా తీర్చిదిద్దడం, దాని సత్తాను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్‌ యుద్ధ విమానాలు, దానికి సంబంధించిన పరికరాలు, ఆయుధ వ్యవస్ధ పరికరాలు నిర్దేశిత సమయంలోనే భారత్‌కు అందగలవని మాకు నమ్మకం ఉంది."
- రాజ్​నాథ్​సింగ్​, రక్షణమంత్రి

ఆయుధపూజ

ఫ్రాన్స్ ఉన్నతస్థాయి రక్షణ ప్రతినిధులు, డసో అధికారుల సమక్షంలో రాజ్​నాథ్ యుద్ధ విమానాన్ని స్వీకరించారు. దసరా పండుగతో పాటు వాయుసేన 87వ వార్షికోత్సవం రోజే రఫేల్‌ భారత్‌కు అందడం పట్ల రాజ్‌నాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం రఫేల్‌లో రాజ్‌నాథ్‌ విహరించారు.

భారీ రక్షణ ఒప్పందం

36 రఫేల్‌ విమానాల కోసం ఫ్రాన్స్​కు చెందిన డసో ఏవియేషన్​తో 58 వేల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందం కుదుర్చుకుంది భారత్​ . అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులను మోసుకెళ్లడం రఫేల్‌ ప్రత్యేకత. రాజ్‌నాథ్‌ తొలి విమానాన్ని అందుకున్నా ఫ్రాన్స్ అందించబోయే మొదటి బృందంలోని నాలుగు విమానాలు వచ్చే ఏడాది మే నెలలోనే భారత్‌ చేరుతాయి.

ఈ రఫేల్​ యుద్ధ విమానాలను పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. పాకిస్తాన్‌ సరిహద్దుకు కేవలం 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాలా వైమానిక స్థావరం వద్ద వ్యూహాత్మకంగానే ఈ విమానాలను మోహరించనున్నట్లు సమాచారం. రఫేల్‌ రాక నేపథ్యంలో భారత వైమానిక దళం ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు, పైలట్లకు శిక్షణ వంటి ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఇదీ చూడండి: రావణుడికి విల్లు ఎక్కిపెట్టిన ప్రధాని మోదీ

AP Video Delivery Log - 1300 GMT News
Tuesday, 8 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1258: UK Climate Protests 2 Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; Part no online access by any UK or Republic of Ireland newspaper platform; Part no online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4233710
Climate protesters removed by police
AP-APTN-1253: Belgium EU Brexit AP Clients Only 4233717
EU Commission spox: we want a Brexit deal
AP-APTN-1249: Syria Turkey Fighters AP Clients Only 4233715
Turkish-backed Forces Free Syrian Army fighters have been training
AP-APTN-1247: Japan Nissan President AP Clients Only 4233712
Head of Nissan's China business named as new CEO
AP-APTN-1227: Afghanistan Blast Hospital AP Clients Only 4233709
At least 19 injured in Afghan university bomb
AP-APTN-1223: Turkey Syria Border 2 AP Clients Only 4233708
Border ahead of expected Turkish push into Syria
AP-APTN-1217: Sweden Nobel Physics 2 AP Clients Only 4233705
Three win physics Nobel for work on cosmos
AP-APTN-1205: China Pakistan AP Clients Only 4233702
Pakistan PM Imran Khan meets Chinese counterpart
AP-APTN-1201: China MOFA 2 AP Clients Only 4233699
China demands US lift new sanctions
AP-APTN-1153: Thailand Elephants Parts no access Thailand 4233698
Five more dead elephants found
AP-APTN-1151: Belgium UK Frost AP Clients Only 4233697
UK Brexit envoy back at European Commission
AP-APTN-1149: Russia Syria US AP Clients Only 4233696
Kremlin: US didn't contact Russia on Syria pull-out
AP-APTN-1145: Japan Exhibition No access Japan/Part cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4233695
Japan resumes controversial exhibition
AP-APTN-1133: France Police Tribute AP Clients Only 4233694
Police knife attack victims given top award
AP-APTN-1122: UK Climate Protests No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4233693
Climate protesters gradually removed by police
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Oct 8, 2019, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.