ETV Bharat / bharat

భార్య నగలు అమ్మి.. ఆటోను అంబులెన్సుగా మార్చి

author img

By

Published : Apr 30, 2021, 12:48 PM IST

auto ambulance
ఆటో అంబులెన్స్​

కరోనా విజృంభణ వేళ.. భారతావని ఆక్సిజన్ కోసం అల్లాడుతోంది. ఊపిరి నిలిపే ప్రాణవాయువు కరవై.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఎంతోమంది మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు మధ్యప్రదేశ్‌కి చెందిన ఆటోడ్రైవర్‌. తన భార్య నగలను అమ్మి ఆటో అంబులెన్స్‌ ఏర్పాటు చేసి.. రోగుల ఊపిరి నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు.

దేశంలో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ అంబులెన్స్​ల కొరత రోగుల పాలిట శాపంగా మారింది. ఇది చూసి చలించిపోయిన మధ్యప్రదేశ్​కి చెందిన ఓ యువకుడు తన ఆటోనే అంబులెన్స్​గా మార్చాడు. ఈ ఆటో ఎక్కే రోగుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాడు. ఇందుకు తన భార్య దాచుకున్న డబ్బులు ఖర్చుపెట్టాడు. ఐతే, జావేద్ ఇదంతా డబ్బులు ఆశించి చేయలేదు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తనవంతుగా ఏదైనా సాయం చేయాలని అనుకున్నాడు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా అత్యవసర సేవలు అందించి ఆసుపత్రులకు తరలించేందుకే ఈ అంబులెన్స్ సిద్ధం చేసినట్లు జావెద్ చెబుతున్నాడు.

auto ambulance
ఆటో అంబులెన్స్​..

"అంబులెన్స్‌లు లేక కొంత మంది ఇబ్బంది పడుతున్నారని సామాజిక మాధ్యమాలు, న్యూస్ ఛానెళ్లలో చూశాను. వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆటో అంబులెన్స్‌ రూపొందించాను. నా భార్య లాకెట్‌ అమ్మి వచ్చిన నగదుతో ఈ అటో అంబులెన్స్‌ ఏర్పాటు చేశాను. ఆక్సిజన్ సిలిండర్ తీసుకున్నాను."

-జావేద్ ఖాన్, ఆటో అంబులెన్స్‌ రూపకర్త

auto ambulance
ఆక్సిజన్ సిలిండర్​ ఏర్పాటు చేస్తున్న జావేద్ ఖాన్

కుటుంబ సభ్యుల సలహాతో ఆక్సిజన్, శానిటైజర్, ఔషధాలతో జావెద్ ఆటోను అంబులెన్సుగా మార్చాడు. గంటల పాటు క్యూలైన్లో ఉండి.. సుమారు 400 వెచ్చించి స్థానిక పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్‌ను నింపుతున్నాడు. ఫోన్ చేసిన వారిని ఉచితంగా ఆసుపత్రికి తరలిస్తున్నాడు. గత 20 రోజుల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న 9 మందిని ఆసుపత్రికి తరలించాడు. అటు.. కరోనా భయాలతో కన్నవారే దగ్గరకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో.. రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు జావెద్ చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు.

auto ambulance
జావేద్ ఖాన్ ఆటో అంబులెన్స్​లో ప్రాణవాయువు సుదపాయం
auto ambulance
ఆటో అంబులెన్స్​లో అందుబాటులో పీపీఈ కిట్

ఇవీ చదవండి: అంబులెన్స్​ కోసం రోజూ 9000 ఫోన్ కాల్స్!

కరోనా రోగుల కోసం 'ఆటో అంబులెన్స్​' సేవలు

మానవత్వం చాటుకున్న అంబులెన్స్​ డ్రైవర్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.