ETV Bharat / bharat

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్.. ర్యాపిడో బుక్ చేసుకుంటా అన్నందుకే!

author img

By

Published : May 25, 2023, 8:27 PM IST

auto-driver-hit-software-engineer-in-karnataka-for-refused-auto
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఆటోతో కొట్టిన డ్రైవర్​

ర్యాపిడో బైక్​ బుక్​ చేసుకుంటానని అన్నందుకు ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను ఆటోతో ఢీ కొట్టాడు ఓ డ్రైవర్. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

ఆటో కాకుండా ర్యాపిడో బైక్​ బుక్​ చేసుకుంటానని చెప్పినందుకు ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను వాహనంతో ఢీ కొట్టాడు డ్రైవర్​. అనంతరం ఆటోతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. కర్ణాటక బెంగళూరులో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉన్న సీసీటీవీలో ఘటన దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 3.30 గంటలకు ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. హెచ్​ఎస్​ఆర్​ లేఅవుట్ సెక్టార్ వన్ ప్రాంతంలో వాహనం కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ ఆటో వచ్చింది. దీంతో ఆటో వద్దకు వెళ్లిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. డ్రైవర్​తో రేటు​ విషయంపై మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సరైన బేరం కుదరలేదు. దీంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్.. తనకు ఆటో వద్దని.. ర్యాపిడో బైక్​ బుక్​ చేసుకుంటానని డ్రైవర్​కు చెప్పి పక్కకు వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్​.. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను వాహనంతో ఢీ కొట్టాడు. దీంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కింద పడ్డాడు. వెంటనే లేచి.. ఆటోడ్రైవర్​ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆటోతో పాటు అక్కడి నుంచి పారిపోయాడు డ్రైవర్. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఘటనపై కేసు నమోదు పోలీసులు.. సీసీటీవీ పుటేజ్​ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఘటన దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా బెంగళూరులో చాలా రోజులుగా ర్యాపిడో బైక్​లపై.. ఆటో డ్రైవర్లు​ నిరసన తెలుపుతున్నారని పోలీసులు చెప్పారు.

భార్యను చంపిన భర్త.. తల నరికి..
పొలంలో భార్యను హత్య చేసి.. తలను ఇంటికి తీసుకువచ్చాడు ఓ భర్త. ఉదయం భార్యతో పాటే పొలానికి వెళ్లి భర్త.. అక్కడ ఆమెతో గొడవపడి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో జరిగింది. కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారా గ్రామంలో నివాసం ఉండే చంద్రశేఖర్​ కరి.. తన భార్య ఊర్మిళను హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం చంద్రశేఖర్​, ఊర్మిళ వివాహం చేసుకున్నారని వివరించారు.

యువకుడిపై 12 మంది కత్తులతో దాడి..
పంజాబ్​లో ఓ యువకుడిపై 12 మంది దుండగులు దాడి చేశారు. పదునైన కత్తులతో దాడి చేసి.. యువకుడి చేతిని నరికేశారు. అనంతరం బాధితుడు కేకలు వేయడం వల్ల.. వచ్చిన స్థానికులను దుండగులు చెదరగొట్టారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని వారు పేర్కొన్నారు. బాధితుడ్ని శివం భోగల్​గా గుర్తించారు. జలందర్​లో జిల్లాలో మంగళవారం రాత్రి ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి : ఐదు రోజులుగా నదిలోనే ఏనుగు.. బయటకు వచ్చేందుకు నిరాకరణ

కాళ్లు, చేయి లేకున్నా సివిల్స్​లో విజయం.. దివ్యాంగుల అద్భుత ప్రతిభ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.