ETV Bharat / bharat

ఫ్లైట్​లో గొడవ.. సిబ్బందిపై దాడి.. ఆ ఒక్కడి వల్ల వందల మందికి అవస్థలు

author img

By

Published : Apr 10, 2023, 12:51 PM IST

Updated : Apr 10, 2023, 1:57 PM IST

AI deboards unruly passenger
AI deboards unruly passenger

ఎయిర్‌ఇండియా విమానంలో మరో ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. క్యాబిన్​ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికుడి దురుసు ప్రవర్తన కారణంగా పైలట్‌ విమానాన్ని దిల్లీ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్‌ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

ఎయిర్​ఇండియాలో మూత్ర విసర్జన చేసిన ఘటన మరవకముందే మరో ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. దిల్లీ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ఇండియా AI 111 విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్‌ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికుడి దురుసు ప్రవర్తన కారణంగా పైలెట్‌ విమానాన్ని టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే తిరిగి దిల్లీ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్‌ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటికే ప్రయాణికుడి అనుచిత ప్రవర్తనపై విమాన సిబ్బంది రెండు సార్లు హెచ్చరించినట్లు పేర్కొంది. నిందితుడిని దిల్లీ విమానాశ్రయంలో పోలీసులుకు అప్పగించినట్లు ఎయిర్‌ఇండియా వెల్లడించింది. విమానంలోని ప్రతి ఒక్కరి భద్రత, గౌరవానికి ఎయిర్‌ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. విమానాన్ని తిరిగి మధ్యాహ్నం లండన్​కు పంపించనున్నట్లు తెలిపింది. అయితే, గొడవకు గల కారణాన్ని ఎయిర్‌ఇండియా స్పష్టంగా పేర్కొలేదు.

"దిల్లీ నుంచి ఉదయం 6:35 గంటల సమయంలో ఎయిర్ఇండియా విమానం బయలుదేరింది. టేకాఫ్​ అయిన కొద్దిసేపటి తర్వాత ఓ ప్రయాణికుడు ఇద్దరు క్యాబిన్​ సిబ్బందితో గొడవ పడి వారిపై దాడి చేశాడు. సిబ్బంది హెచ్చరించినా వినకపోవడం వల్ల.. విమానాన్ని 9:40 గంటలకు తిరిగి దిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. విమానంలో సుమారు 225 మంది ప్రయాణికులు ఉన్నారు."

--డీజీసీఏ అధికారులు

ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన
అంతకుముందు కూడా ఎయిర్​ఇండియా విమానాల్లో ప్రయాణికులు వీరంగం సృష్టించారు. గతేడాది నవంబర్​ 26న న్యూయార్క్​ నుంచి దిల్లీ వస్తున్న ఓ విమానంలోని వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్‌ను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో తలదాచుకున్న అతడిని అరెస్ట్ చేసి దిల్లీకి తరలించారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడి విధించారు. ఈ ఘటన నేపథ్యంలో శంకర్‌ ఉద్యోగంపైనా వేటు పడింది. అమెరికన్‌ ఫైన్షానియల్‌ సంస్థ వెల్స్‌ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న అతడిని సంస్థ విధుల నుంచి తొలగించింది. ఈ ఘటనపై ఎయిరిండియా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటన సమయంలో ఉన్న విమాన పైలట్‌, క్యాబిన్‌ సిబ్బందిపై వేటు వేసింది. దీనిపై టాటా సన్స్​ ఛైర్మన్​ చంద్రశేఖరన్​ సైతం విచారం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి : గుడిపై కూలిన భారీ వృక్షం.. ఏడుగురు భక్తులు మృతి.. 23 మందికి గాయాలు

చెట్లకు మనుషుల పేర్లు.. దత్తత తీసుకుని మరీ నామకరణం.. ఎందుకంటే..

Last Updated :Apr 10, 2023, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.