ETV Bharat / bharat

తాజ్​మహల్​కు ఇంటి పన్ను చెల్లించాలంటూ ఏఎస్‌ఐకి నోటీసులు

author img

By

Published : Dec 19, 2022, 7:30 PM IST

agra-municipal-corporation-sent-notice-to-asi-for-taj-mahal-house-tax
తాజ్​మహల్

ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్​మహల్​కు ఇంటిపన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్​ (ఏఎంసీ).. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్‌ఐ)కి నోటీసులు పంపింది. పన్ను చెల్లించేందుకు 15 రోజులు గడువు ఇచ్చింది.

ప్రపంచంలో అద్భుత స్మారక చిహ్నమైన తాజ్​మహల్​ ఇంటిపన్ను బకాయిలను చెల్లించాలంటూ ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్​ (ఏఎంసీ).. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్‌ఐ)కి నోటీసులు పంపింది. ఏఎంసీ.. పన్ను చెల్లించేందుకు ఏఎస్‌ఐకి 15 రోజులు గడువు ఇచ్చింది. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పన్ను అసెస్​మెంట్​ అధికారి నవంబరు 25న ఈ నోటీసులను జారీ చేశారు. అయితే ఈ నోటీసులు ఏఎస్​ఐకి ఇటీవలే అందాయి. తాజ్​ మహల్​తో పాటు యమునా నదికి ఆనుకొని ఉన్న స్మారక చిహ్నం ఎత్మాద్-ఉద్-దౌలాకు కూడా నోటీసులు జారీ చేశారు.

agra-municipal-corporation-sent-notice-to-asi-for-taj-mahal-house-tax
తాజ్​మహల్​కు హౌస్ టాక్స్ చెల్లించమంటూ ఏఎస్‌ఐకి నోటీసులు

అయితే బ్రిటిషు హయాం నుంచి ఇప్పటి వరకు ఇలా పన్నులు కట్టమని నోటీసులు పంపడం జరగలేదని, ఇదే మొదటిసారి అని ఏఎస్ఐ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏఎంసీ పంపించిన నోటీసుల ప్రకారం 2022 మార్చి 31 వరకు పెండింగ్​లో ఉన్న భూమి పన్ను రూ. 88,784గా ఉంది. దీంతో పాటు అదనంగా రూ. 47,943 వడ్డీ చెల్లించాల్సి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి హౌస్ టాక్స్ రూ. 11,098గా ఉంది. శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా ఇంటి పన్ను కోసం సాయి కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేసిన సర్వే ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, తాజ్‌గంజ్ జోనల్ ఇన్‌ఛార్జ్ సరితా సింగ్ తెలిపారు.
ఈ నోటీసుల గురించి ఏఎస్​ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్​కుమార్ సర్కార్ మాట్లాడుతూ.. తాజ్​ మహల్​తో సహా అన్ని స్మారక చిహ్నాల సంరక్షణ బాధ్యతలను మాత్రమే తాము చూస్తామని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.