ETV Bharat / bharat

92 ఏళ్ల వయసులో 2 గోల్డ్​ మెడల్స్​!

author img

By

Published : Jan 2, 2022, 6:33 PM IST

92 year old won gold medal
హరేష్​ దేశాయ్

ఆయన ఓ రిటైర్డ్​ బ్యాంక్ ఉద్యోగి. వయసు 92 ఏళ్లు. కానీ ఇంకా చురుగ్గా క్రీడా పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. శారీరకంగా దృఢంగా ఉండేందుకు కృషి చేసే హరేశ్​.. యువత కూడా ఫిట్​గా ఉండాలని సూచించారు.

92 ఏళ్ల వయసులో 2 గోల్డ్​ మెడల్స్​!

నేటి యువత కొద్దిపాటి శ్రమకే డీలా పడిపోతోంది. కంప్యూటర్ల పుణ్యమా అని శారీరక శ్రమకు దూరంగా ఉంటోంది. ఇక శారీరక బలం లేక.. ఏ పని చేయలేకపోతోంది. అలాంటిది ఓ వ్యక్తి.. 92ఏళ్ల వయసులో కూడా చురుకుగా క్రీడల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పరుగుపందెంతో పాటు వివిధ క్రీడల్లో పాల్గొంటూ.. సునాయాసంగా పతకాలు వెనకేసుకుంటున్నారు. ఆయనే.. గుజరాత్​లోని సూరత్​కు చెందిన హరేష్​ దేశాయ్​.

92 year old won gold medal
పతకాలతో హరేష్​ దేశాయ్​

బ్యాంక్​ ఆఫీసర్​గా పని చేసి రిటైర్​ అయిన హరేష్​కు.. క్రీడలంటే ఎంతో ఇష్టం. అందుకే.. సీనియర్​ సిటీజన్ల కోసం నిర్వహించే పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. 2010లో మలేసియాలో జరిగిన ఆసియాన్​ మాస్టర్స్​ ఛాంపియన్​షిప్​కు భారత్​ తరపున ప్రాతినిథ్యం వహించారు. ఆ పోటీల్లో మూడో స్థానంలో నిలిచారు. 2012లో జరిగిన స్థానిక క్రీడా పోటీల్లో పాల్గొని.. హ్యామర్​ త్రోలో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 2016లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. ఇటీవల వారణాసిలో నిర్వహించిన టోర్నీలో కూడా రెండు పసిడి పతకాలు, ఓ రజతాన్ని సాధించారు. వంద మీటర్ల పరుగు, షాట్​పుట్​, హ్యామర్​ త్రో క్రీడల్లో ఆయనక ఎదురులేదు!

ఈ వయసులోనూ.. శారీరకంగా దృఢంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని అంటున్నారు హరేశ్​. రోజుకు అరగంట పాటు వ్యాయామం తప్పనిసరిగా చేస్తానని చెప్పిన ఆయన​.. ప్రతి ఒక్కరు ఫిట్​గా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి : బిల్లు అడిగారని లిక్కర్​​ పారబోసి నిరసన.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.