ETV Bharat / bharat

63ఏళ్ల వయసులో రోజూ 50కిమీ సైక్లింగ్​- 100 రోజుల్లోనే 5వేల కిమీ పూర్తి, ఇండియా బుక్​లో స్థానం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 11:13 AM IST

5000 KM Cycling in 100 Days : కర్ణాటక హుబ్బళ్లికి చెందిన ఓ వృద్ధుడు 5వేల కిలోమీటర్లు సైకిల్​ తొక్కి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 100 రోజుల్లోనే ఈ ఫీట్​ను సాధించి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు.

India Book of Record in Cycling
India Book of Record in Cycling

63 ఏళ్ల వయసులో 5వేల కి.మీ సైక్లింగ్​

5000 KM Cycling in 100 Days : ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఓ వృద్ధుడు. 63 ఏళ్ల వయసులో 5000 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. 100 రోజుల్లోనే ఈ ఘనతను అందుకున్నారు.

India Book of Record in Cycling : కర్ణాటక హుబ్బళ్లికి చెందిన గురుమూర్తి వృత్తిరీత్యా ఛార్టెడ్​ అకౌంటెంట్​. ఆయనకు చిన్ననాటి నుంచి క్రీడలంటే అమితమైన ఆసక్తి. 60 ఏళ్లు వచ్చేవరకు క్రికెట్​, వాలీబాల్​, ఫుట్​బాల్, టెన్నిస్​ ఆడిన గురుమూర్తికి.. కొద్దికాలం క్రితం కాలి గాయమైంది. ఫలితంగా క్రీడలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా వ్యాయామం చేయాలని భావించిన గురుమూర్తి.. సైక్లింగ్​ను ప్రారంభించారు.

India Book of Record in Cycling
ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్​తో గురుమూర్తి

మొదట్లో ఆరోగ్యం కోసం ఇంటి సమీపంలోనే సైకిల్​ తొక్కడం ప్రారంభించిన గురుమూర్తికి.. ఆ తర్వాత అదే ఆసక్తిగా మారిపోయింది. హుబ్బళ్లి సైకిల్​ క్లబ్​లో చేరిన ఆయన అనేక అవార్డులను సాధించారు. ఈ క్రమంలోనే మే 11 నుంచి ఆగస్టు 18 వరకు రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. రోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు సైకిల్​ తొక్కి ఈ ఫీట్​ను సాధించారు.

India Book of Record in Cycling
గురుమూర్తి సాధించిన ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్

"గురుమూర్తి సాధించిన ఈ అవార్డు ప్రస్తుత తరానికి ఎంతో ఆదర్శం. ఈ రికార్డ్ సాధించడం అంత సులభం కాదు. తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల వరకు నిర్విరామంగా 100 రోజులు సైకిల్​ తొక్కారు. ఆయన కష్టానికి ఫలితమే ఈ రికార్డ్. ఆయన సైకిల్ తొక్కిన టెండర్​ రోడ్​ పేరును గురుమూర్తి రోడ్డుగా మార్చితే బాగుంటుంది."
--సుబ్రమణ్య, సైకిల్ క్లబ్ సభ్యుడు

వాతావరణానికి ఎంతో మేలు
చిన్న పనులకు కూడా మోటార్ వాహనాల్లో ప్రయాణిస్తున్న ఈరోజుల్లో.. సైకిల్ తొక్కి వాతావరణానికి మేలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. గురుమూర్తి రికార్డ్​తో సైకిల్​ తొక్కడంపై యువతలో ఆసక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

India Book of Record in Cycling
ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్

53 ఏళ్ల సూపర్​ డాక్టర్​.. సైకిల్​పై 'లక్ష' కి.మీ సవారీ.. గిన్నిస్​ రికార్డే టార్గెట్​!
సైక్లింగ్​లో ఎవరూ సాధించని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నారు ఓ 53 ఏళ్ల డాక్టర్​. ఇప్పటివరకు సైకిల్​పై లక్ష కిలోమీటర్ల ప్రయాణం చేసిన ఆయన గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించడమే లక్ష్యంగా తన యాత్రను కొనసాగిస్తున్నారు​. నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న ఆ సూపర్​ డాక్టర్​ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వెయిట్ లాస్​ కోసం సైక్లింగ్ స్టార్ట్ చేస్తారా? ఎలాంటి సైకిల్ కొనాలి? గేర్స్ తప్పనిసరా?

పాదచారులు, సైక్లిస్ట్​లకు జై.. ట్రాఫిక్, కాలుష్యానికి బై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.