వేగంగా వస్తున్న కారు ఢీకొని విశ్రాంత సైనికుడు మృతి
తాగిన మత్తులో ఓ వ్యక్తి అతివేగంగా కారు నడిపి ఒకరి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెబ్బల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఫుట్‌పాత్ పైన బైక్‌తో ఉన్న వారిపైకి ఒక్కసారిగా కారు దూసుకురాగా ఓ విశ్రాంత సైనికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సీసీటీవీలో ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మృతి చెందిన రిటైర్డ్ సోల్జర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యురిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. గాయపడిన వారు కూడా మృతిడితో కలిసి పనిచేసేవారని హెబ్బర్ పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తికి గాయాలు కావడం వల్ల అతన్నీ ఆస్పత్రికు తరలించినట్లు పోలీసులు తెలిపారు.