Tragedy Incident in Tallarevu: తాళ్లరేవులో విషాదం.. గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 10:28 AM IST

Updated : Oct 22, 2023, 10:57 AM IST

thumbnail

Tragedy Incident in Tallarevu: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన నలుగురు యువకులు గోపాలపురం వద్దనున్న గౌతమీ గోదావరిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా.. తెల్లవారుజామున గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలను గుర్తించారు. 

అసలు ఏం జరిగిందంటే.. ''పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం పార్కు వీధికి చెందిన ఏడుగురు యువకులు.. ఆనందంగా గడిపేందుకు విహార యాత్రకు వచ్చారు. వారిలో నలుగురు గోదావరిలో గల్లంతయ్యారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యానాంకి వచ్చిన యువకులు.. అక్కడి నుంచి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక పుష్కర ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. కాసేపు సరదాగా గడిపారు. పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన హనుమకొండ కార్తిక్‌ (21) మొదటగా గోదావరిలో స్నానానికి దిగాడు. అతను నీటిలో మునిగిపోతుండటంతో ఒడ్డున ఉన్న ఆరుగురిలో మద్దెన ఫణీంద్ర గణేష్‌(21), పెండ్యాల బాలాజీ(21), టి.రవితేజ (21)లు కార్తిక్‌ను రక్షించేందుకు గోదావరిలో దిగారు. వారు కూడా నదీ ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో వారిని ఒడ్డుకు చేర్చేందుకు సలాది దుర్గా మహేష్‌, కొమ్మిరెడ్డి చైతన్య నదిలో దిగారు. ఎంత ప్రయత్నించినా వీలుపడకపోవడంతో వెనక్కి వచ్చేయగా వారు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతావారు గల్లంతయ్యారు'' అని పోలీసులు ఘటన వివరాలను వెల్లడించారు.

Last Updated : Oct 22, 2023, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.