TDP Women Wing Filed Complaint Police: వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై.. పోలీసులకు టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 8:22 PM IST

thumbnail

 TDP Women Wing Filed Complaint Police: సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఎమ్మెల్సీ భరత్‌పై కుప్పం తెలుగుదేశం మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   భరత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ...  కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో తెలుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ భరత్‌ తమపై అసత్య ఆరోపణలు చేస్తూ..  తమ పరువుకు భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్​లు పెట్టారని పేర్కొన్నారు.  భరత్‌పై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. 

చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా తెలుగు మహిళలు గత శుక్రవారం కప్పంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ దేవతామూర్తుల రూపాలను ధరించిన మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బాబు అరెస్ట్ అక్రమం అంటూ.. ఆయను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న తమపై .. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్​లు పెట్టారని తెలుగు మహిళలు ఆరోపిస్తున్నారు. తమ పరువుకు భంగం కలిగించిన వైసీపీ నేత భరత్​పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. తమని పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎద్దేవా చేశారని, ఆవేదన వ్యక్తం చేశారు. తాము చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని దీక్ష నిర్వహించామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.