తెలుగుదేశం పార్టీ జెండాను తొలగించిన వైసీపీ నేతలు - ధర్నా చేస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు
TDP Leaders Protest On Road Police Arrest In Srinivas Reddy: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాను తొలగించడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ స్థానిక నేత శ్రీనివాస రెడ్డి తన అనుచరులతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సీఎం జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థఇతి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పరిస్ఱితిని అదుపు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస రెడ్డిని పోలీసులు వాహనం ఎక్కించేందుకు యత్నించడంతో టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు, పోలీసుల మధ్య త్రీవ వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం జగన్ డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం 'దొంగల రాజ్యం దోపిడి రాజ్యం' అంటూ నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.