అర్ధరాత్రి సమయంలో గ్రావెల్ తరలింపు- అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 11:58 AM IST

thumbnail

TDP Leader Sowmya Stopped Gravel Illegal Mining: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో.. అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తరలింపును మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. కొన్నాళ్లపాటు అక్రమ రవాణాలను నిలిపివేసిన అక్రమార్కులు.. మళ్లీ ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే.. స్థానిక నాయకులతో కలిసి అక్కడకు వచ్చి అక్రమ రవాణాలను అడ్డుకున్నారు. 

TDP Protest on Gravel Illegal Mining: గ్రావెల్ అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. నందిగామ మండలం రాఘవాపురం కొండ గ్రావెల్​ను లారీలతో తరలిస్తున్నారని.. స్థానిక వైసీపీ నేత కనుసన్నల్లో ఈ అక్రమ దందా జరుగుతోందని ఆమె ఆరోపించారు. అక్రమ గ్రావెల్ తరలింపులను అడ్డుకున్న సౌమ్య.. పార్టీ నాయకులతో కలిసి.. తెల్లవారుజామున 5 గంటల వరకు రాఘవాపురం కొండ వద్ద ఆందోళన చేశారు. అధికారులు ఘటనాస్థలికి వచ్చేంతవరకు అక్కడే నిద్రపోయారు. ఈ ఘటనపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రొక్లెయిన్లు, లారీలను పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.