SI Physical Events Postponed in Kurnool : వర్షం కారణంగా ఎస్సై దేహదారుఢ్య పరీక్ష సెప్టెంబర్​ 21కి వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 12:15 PM IST

thumbnail

SI Physical Events Postponed in Kurnool : కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేశారు. వర్షం కారణంగా సోమవారం (సెప్టెంబర్ 4) జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ప్రకటించారు.  ఈ పరీక్షను సెప్టెంబర్ 21న నిర్వహిస్తామని డీఐజీ తెలిపారు.  

జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. ఈ కారణంగా ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేశారు. అయితే ఫిబ్రవరి 19న ఎస్సై రాత పరీక్షను ( SI preliminary exam) నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారుగా లక్ష మంది పైగా హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 28న ఏపీ పోలీసు రిక్రూట్​మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షకు సుమారుగా లక్ష మంది పైగా హాజరయ్యారు. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. అర్హులైన వారికి ఆగస్టు 25 నుంచి దేహదారుఢ్యు పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు అక్టోబర్ 14,15 తేదీల్లో తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.