కేంద్రమంత్రికి నిరసన సెగ - క్షమాపణ చెప్పాలంటూ సర్పంచ్​ల నినాదాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 6:48 PM IST

thumbnail

Sarpanchs Protest Against Union Minister Devsingh Chouhan: రాష్ట్రంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రికి సర్పంచ్​ల నుంచి నిరసన ఎదురైంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కోడుమూరులో కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ (Union Minister Devsingh Chouhan)​ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా ఆయనకు నిరసన సెగ తగిలింది. స్థానిక సర్పంచ్​ని వేదిక మీదకు పిలవకపోవడంచో సర్పంచ్​లు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారు అధికారులపై నిరసన వ్యక్తం (Sarpanchs Protest) చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న పంచాయతీల నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. సర్పంచ్​లకు అధికారాలు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోటోకాల్ పాటించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వాలని నాయకులు నిర్ణయించారు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం సర్పంచిని వేదిక పైకి పిలువకపోగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​లకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు, పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.