మా డిమాండ్లు పరిష్కరించేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తాం - ఎంప్లాయూస్ ఫెడరేషన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 5:41 PM IST

thumbnail

Samagra Shiksha Contract Employes Federation Agitation: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ విశాఖలో ఆందోళన చేపట్టింది. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్​ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు.

Employees Protest to Fullfill Demands: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం,హెచ్ఆర్ఏ, డీఏ అమలు చేసి వేతనాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్ట్​టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్​టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని, రూ.10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యుటీ, సామాజిక భద్రతా పథకాలు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు అమలు చేయాలని ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులు స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.