వైఎస్సార్సీపీ నేతలకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదు- బీజేపీ భానుప్రకాష్‌ - BJP Bhanu Prakash on YSRCP Attacks

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 4:46 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ నాయకులకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదు- అందుకే విచ్చలవిడి దాడులు: బీజేపీ భానుప్రకాష్‌ (ETV Bharat)

BJP Leader Bhanu Prakash Reddy on YSRCP Attacks: వైఎస్సార్సీపీ నాయకులకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలనే కసితో ఓట్లు వేశారన్న ఆయన జగన్‌ అరాచక పాలన అంతం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. జూన్​ నాలుగో తేదీన రాష్ట్రంలో అధికార మార్పిడీ జరిగుతుందని, వైఎస్సార్సీపీ దౌర్జన్యాలు, దాడుల నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

"వైఎస్సార్సీపీ నాయకులకు ఐదేళ్ల రక్తదాహం తీరినట్లు లేదు. అందుకే ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా దాడులకు తెగబడ్డారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలనే కసితో ఓట్లు వేశారు. జగన్‌ అరాచక పాలన అంతం కావడం ఖాయం." - భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.