శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ భక్తులు - ఏమేం పూజలు చేయించారంటే!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 5:01 PM IST

thumbnail

Russian Devotees Visit Srikalahasti Temple: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు, కేతు పూజలు చేస్తే.. సర్వ దోషాలు తొలగిపోతాయని అపార నమ్మకం. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ భక్తులు సందడి చేశారు. సుమాపు 15మంది రష్యన్ భక్తులు స్వామివారిని దర్శించుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Russians At Srikalahasti Temple: హిందూ సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలో నిర్వహించే రాహు కేతు సర్ప దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని రష్యన్ భక్తులు ప్రార్థనలు చేశారు. ఓం నమఃశివాయ అంటూ.. ముక్కంటి నామస్మరణలు చేస్తూ.. ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలోని పరిహార దేవతామూర్తులతో పాటు పరిసర ప్రాంతాలు, ఆలయ గోడలపై శిల్పాలను ఆసక్తిగా తిలకించారు. దీంతోపాటు ఆలయ చరిత్ర, విశిష్టత గురించి రష్యన్ భక్తులు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.