గ్రామాల్లోనే ఉన్నా ఫారం 7 నోటీసులు - ఎన్నికల అధికారుల సమావేశంలో బాధితుల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 2:53 PM IST

thumbnail

Opposition Leaders Meeting With Election Officers Under AERO in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఓట్ల జాబితాలో వైఎస్సార్సీపీ నాయకులు భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. ఓట్ల జాబితాపై చర్చించేందుకు తహశీల్దార్ కార్యాలయంలో ఏఈఆర్వో శ్రీధర్ మూర్తి అధ్యక్షతన ఎన్నికల అధికారులు పార్టీలతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లోనే ఉన్నా.. లేరంటూ ఫారం-7 నోటీసులు ఇచ్చారని.. నోటీసులు అందుకున్న జనం తాము గ్రామాల్లోనే ఉన్నామని తగిన ఆధారాలతో వివరణ ఇవ్వడానికి వెళ్తే వాటిని తీసుకోవడానికి అధికారులు నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు.

Irregularities in AP Voter List 2023 : ఓటరు నమోదుకు అన్​లైన్​లో వచ్చిన దరఖాస్తులను బీఎల్వోల పరిశీలన లేకుండానే ఆమోదించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు. కొన్ని చోట్ల నిర్దేశిత వయస్సు లేని పిల్లలకు ఓటు హక్కు ఇచ్చారని, ఇది వరకే తాము వాటిని ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తెచ్చామని‌, దానిపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరాలించాలన్నారు. చాలా చోట్ల ఓటర్ల తొలగింపు అంశంపై రహస్య విచారణ చేస్తున్నారన్నారు. 

Vote Irregularities in AP Under YSRCP Leaders : తహశీల్దార్ కార్యాలయాల్లో రాత్రి పూట అధికారులు ఉంటూ, ఓటర్ల జాబితాలను కొందరి కనుసన్నల్లో తయారు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. దీంతో నాయకులు, అధికారులు మధ్య వాదన చోటు చేసుకుంది. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలను పారదర్శకంగా చేపడుతామని ఏఈఆర్వో శ్రీధర్ మూర్తి నాయకులకు తెలిపారు. వివరణలను ఆయా మండల కేంద్రాల్లోనే అధికారులు స్వీకరించేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.