లక్ష మందితో భగవద్గీత పారాయణం- శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్- గిన్నిస్​ రికార్డు పక్కా!

By PTI

Published : Dec 24, 2023, 5:07 PM IST

thumbnail

One Lakh People Chant Bhagavad Gita in Kolkata : బంగాల్​లో సుమారు లక్ష మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోల్​కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్​లో గీతా పారాయణం చేశారు. యువత నుంచి పెద్దవారి వరకు అంతా సంప్రదాయ దుస్తులు ధరించి భగవద్గీత పఠించారు. అనేక మంది మునులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలతో శ్లోకాలు చదివించారు. దీంతో కార్యక్రమం జరిగిన ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పరిసరాలన్నీ గీతా శ్లోకాలతో మార్మోగిపోయాయి.

సుమారు లక్షా 20 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఒకే చోట అత్యధిక మంది గీతా పారాయణం చేసిన కార్యక్రమంగా దీనికి గిన్నిస్ రికార్డు లభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఆయన రాలేకపోయారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఆ రాష్ట్ర విపక్ష నేత సువేందు అధికారి సహా కీలక ఆర్ఎస్ఎస్ నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భగవద్గీత పారాయణం చేయడం వల్ల సామాజిక సామరస్యం పెంపొందడమే కాకుండా దేశ అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త శక్తి లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు గీత పరిష్కారం చూపిస్తుందని అన్నారు. ఈ మేరకు కార్యక్రమానికి ఆయన సందేశం పంపించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.