Old Women Reaction on CBN Arrest చంద్రబాబు అరెస్టు వార్తతో తీవ్రంగా కలత చెందిన వృద్ధురాలు.. నిద్ర పట్టడం లేదని ఆవేదన!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 5:00 PM IST

Updated : Sep 26, 2023, 7:23 PM IST

thumbnail

Old Women Reaction on CBN Arrest: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో  రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని  అరెస్ట్​ చేసిన నేపథ్యంలో.. సామాన్యులు సైతం ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లిలో టీడీపీ పార్టీ నేతలు బాబుతో మేము అనే  కార్యక్రమాన్ని నీలపల్లిలో గ్రామంలో చేపట్టారు. ఇంటింటికి తిరిగి టీడీపీ కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాళ్లరేవు గ్రామానికి చెందిన సుందరమ్మ అనే 70ఏళ్ల వృద్ధురాలు.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ఆ వద్ధురాలు కన్నీరు పెట్టుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్​ చేసిందనే వార్త వినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదని పేర్కొంది. తిన్న ఆహారం కూడా సహించడం లేదని వెల్లడించింది. చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమంటూ.. సుందరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Last Updated : Sep 26, 2023, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.