'చంద్రబాబు X.O- అధికారంలోకి వస్తే మరో 15ఏళ్లు ఆయనే సీఎం' - Chandrababu book launch

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 12:52 PM IST

thumbnail
'చంద్రబాబు X.O- అధికారంలోకి వస్తే మరో 15ఏళ్లు ఆయనే సీఎం' (ETV Bharat)

Chandrababu X.O Ananta Bhavjalikuda book launch : ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, మరోపక్క సంక్షేమ పథకాలను అమలు చేసిన దార్శనికుడు చంద్రబాబు నాయుడని టీడీపీ నేతలు కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన 'చంద్రబాబు X.O అనంత భావజాలికుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించారు.

Rajamahendravaram East Godavari District : రాష్ట్రంలో పేదరికం తగ్గించాలనే తపన చంద్రబాబు నాయుడులో ఉందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న సవాళ్లను అవకాశాలుగా మలచుకుని అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. చంద్రబాబు మానవతావాదం కోసం పుస్తకం రాయాల్సిన అవసరం ఉందని వీవీ చౌదరి వ్యాఖ్యానించారు. హైదరాబాద్​ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో తమ అధినేత కృషి మరవలేనిదని కొనియాడారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి మరో పదిహేనేళ్ల పాటు రాష్ట్రానికి సేవలందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.