భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి - రిలే దీక్షల్లో న్యాయవాదుల డిమాండ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 12:44 PM IST

thumbnail

Lawyers Relay Hunger Strike Against Land Rights Act: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం-2022, జీవో నెం. 512ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. భూహక్కు చట్టం, 512 జీవోల వల్ల మధ్యతరగతి ప్రజలు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండింటినీ రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్దృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు.

Senior Advocates Comments: ''వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం-2022 వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు భూమి సమస్యలను పరిష్కరించే అధికారాలు ఉంటాయి. అయితే అధికారుల, స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడితో అక్రమాలకు పాల్పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూహక్కు చట్టానికి సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్ 512ని వెంటనే రద్దు చేయాలి. ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ గత ఐదు రోజులుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి, కర్నూలులోని శ్రీకృష్ణదేవరాల కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వెంటనే జీవో నెంబర్ 512ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు స్పందించకపోవడం దారుణం.'' అని పలువురు సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.