డిసెంబర్​ 4న నేవీ డే - విశాఖ ఆర్కే బీచ్​లో విన్యాసాల రిహార్సల్స్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 9:56 PM IST

thumbnail

Indian Navy Day Celebration in Visakhapatnam : భారత నౌకాదళ దినోత్సవం కోసం తూర్పు నౌకాదళం సిద్ధమవుతోంది. డిసెంబర్‌ నాలుగో తేదీన జరిగే నేవీ డే కోసం విశాఖలోని ఆర్​కే బీచ్‌లో పూర్తి స్థాయి విన్యాసాలు చేయనుంది. విన్యాసాలు సన్నద్ధత కోసం మూడు రోజుల పాటు రిహార్సల్స్‌ నిర్వహిస్తోంది. యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో విన్యాసాలు చేశారు. తొలి విడతగా ఈ రోజు(మంగళవారం) నేవీ డే రిహార్సల్స్ నిర్వహించారు. ఈ మేరకు గగనతలంలో హెలికాప్టర్లు, యుద్ద విమానాలు సందడి చేశాయి.

నౌకాదళ దినోత్సవం సందర్భంగా నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగర తీరం పూర్తిగా సన్నద్ధమౌతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో నౌకాదళ విన్యాసాలు చేప‌ట్టనున్నారు. సముద్ర తీరాన ఆర్కే బీచ్​లో జరిగే ఈ ఉత్సవాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా విశాఖ తీరంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్ని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు. యుద్ధ నౌకలు చీకట్లో పసుపు రంగు లైట్లను వెలిగిస్తూ చూపరులనూ అట్టే కట్టి పడేస్తాయి. అలాగే మెరైన్ కమాండోల డ్రిల్, పారా జంపర్లు, స్కై డైవర్ల విన్యాసాలు చూసి తీరాల్సిందేనని ప్రజలు అంటూన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.