పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. నాయనమ్మపై విచక్షణారహితంగా దాడి

By

Published : Sep 2, 2022, 5:07 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

Grandson attack on grandmother: పెన్షన్ డబ్బులు కోసం నాయనమ్మపై విచక్షణారహితంగా దాడికి దిగాడు ఓ మనుమడు. వృద్ధురాలైన నాయనమ్మను మద్యం మత్తులో నోటికొచ్చినట్టు తిడుతూ.. ఎటుపడితే అటు కాళ్లతో తన్నుతూ.. దారుణంగా దాడి చేశాడు ఆ కర్కోటకుడు. ఈ అమానవీయ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దెముల్ మండలం మంబాపూర్​కు చెందిన చింది యశోదమ్మకు ఇటీవలే కొత్త పెన్షన్ మంజూరైంది. మద్యానికి బానిసైన తన మనమడు గోవర్దన్.. ఆమెకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఇవ్వాలని దాడికి తెగబడ్డాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా.. చేతులతో కొడుతూ కాళ్లతో తంతూ.. పశువులా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికులు చరవాణుల్లో రికార్డు చేయగా.. అవి కాస్తా సామాజిక మధ్యామాల్లో వైరల్​ అయ్యాయి. దాడి చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.